Nayanthara: సినిమా ప్రమోషన్‌కు అందుకే నయన్‌ దూరం: విఘ్నేశ్‌ శివన్‌

నయనతార (Nayanthara) విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) దంపతులు తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఇందులో నయన్‌ను ఉద్దేశిస్తూ విఘ్నేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 30 Sep 2023 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి నయనతార (Nayanthara), ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘9స్కిన్‌’ (9Skin) పేరుతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నయన్‌ దంపతులు మలేసియా వెళ్లారు. అక్కడ జరిగిన ప్రెస్‌మీట్‌లో నయన్‌పై విఘ్నేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎన్నో విషయాల్లో తనలో స్ఫూర్తి నింపిందన్నారు. అలాగే, సినిమా ప్రమోషన్స్‌కు నయన్‌ హాజరు కాకపోవడం గురించీ ఆయన మాట్లాడారు.

‘‘నయనతార చాలా సందర్భాల్లో తన సొంత చిత్రాలను కూడా ప్రమోట్‌ చేయడానికి ముందుకు రాలేదు. సినిమాలో మంచి కంటెంట్‌ ఉంటే అది తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుందని ఆమె నమ్ముతుంది. అందుకే ఆమె ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుంది. ప్రకటనల విషయంలో తాను నమ్మితేనే ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. ‘9 స్కిన్‌’ బ్రాండ్‌ను మొదలుపెట్టాలని మేం అనుకున్నప్పుడు.. నయన్‌ ఆ ఉత్పత్తులన్నింటినీ స్వయంగా వాడింది. డిజైన్‌, బాటిల్‌, స్టైల్‌, ప్యాకింగ్‌ ఇలా ప్రతి విషయాన్నీ ఆమె దగ్గరుండి చేసింది. ఈ బ్రాండ్‌ విషయంలో ఆమె ఎంతో శ్రమించింది’’

Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్‌ అడ్డుకోవడంపై సిద్ధార్థ్‌

‘‘నా మొదటి చిత్రాన్ని నయనతారతో తెరకెక్కించాను. ఆ సమయంలో ఆమె నాలో స్ఫూర్తి నింపింది. చిన్న విషయంలోనూ ఆమె ఎంతో నిజాయతీ, నిబద్ధతతో పనిచేస్తుంది’’ అని విఘ్నేశ్‌ శివన్‌ చెప్పారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ‘నేనూ రౌడీనే’లో నయనతార ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో గతేడాది వివాహం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు