Aaliyah: ‘ఇప్పుడే నిశ్చితార్థం అవసరమా?’.. విమర్శలపై స్పందించిన అనురాగ్‌ కుమార్తె

నిశ్చితార్థం విషయంలో తనకు ఎదురైన విమర్శల గురించి ఆలియా కశ్యప్‌ (Aaliyah) స్పందించారు.

Updated : 07 Jun 2023 18:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) కుమార్తె ఆలియా కశ్యప్‌ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు షేన్‌తో ఆమె నిశ్చితార్థం ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆలియా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. వాటిని చూసిన పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ‘22 ఏళ్లకే నిశ్చితార్థం చేసుకోవడం అవసరమా?’, ‘ఇప్పుడే పెళ్లి ఎందుకు?’ అంటూ ప్రశ్నించారు.

కాగా, నిశ్చితార్థం విషయంలో తనకు ఎదురైన విమర్శలపై తాజాగా ఆలియా స్పందించారు. పెళ్లి అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని చెప్పారు. అంతేకాకుండా, విమర్శలను తాను పట్టించుకోనని.. తనకు నచ్చినట్టు ఉంటానని బదులిచ్చారు. ‘‘నిశ్చితార్థం తర్వాత ఎంతోమంది మమ్మల్ని విమర్శించారు. చిన్న వయసులోనే మేమిద్దరం పెళ్లి వైపు అడుగులు వేస్తున్నామని నాకు తెలుసు. మా వరకూ ఇదేమీ పెద్ద విషయం కాదు. బయటవాళ్లు దీన్ని ఒక పెద్ద సమస్యగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను వారి మాటలు పట్టించుకోను. పెళ్లికి వయసుతో సంబంధం లేదు. షేన్‌, నేనూ ఇష్టప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము మూడేళ్లుగా డేటింగ్‌, ఆరు నెలల నుంచి సహజీవనంలో ఉన్నాం. అలాగే, 20 ఏళ్లకే పెళ్లి చేసుకోమని నేను వేరే వాళ్లకు రికమండ్‌ చేయను. ఎందుకంటే ఇది ఒకరి వ్యక్తిగత విషయం. మేమిద్దరం రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాంం’’ అని ఆమె తెలిపారు.

ఆలియా - షేన్‌ ఓ డేటింగ్‌ యాప్‌ వల్ల పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో మే నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. బాలిలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు