Kathanar: కథనార్‌ షూటింగ్‌లో పాల్గొన్న అనుష్క... వైరల్‌ అవుతోన్న ఫొటో

హీరోయిన్‌ అనుష్క మలయాళ సినిమా ‘కథనార్‌’ షూటింగ్‌లో పాల్గొన్నారు.

Published : 12 Mar 2024 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty), జయసూర్య(Jayasurya) జంటగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’ (Kathanar- The Wild Sorcerer). రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో స్వీటీ మొదటి చిత్రం.  ఆమె షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలను దర్శకుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘‘అనుష్క శెట్టి కథనార్‌లో భాగం అయ్యారు. ఆమెతో కలిసి వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని నోట్‌ పెట్టారు. అనుష్క న్యూలుక్‌ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘లేడీ సూపర్‌స్టార్‌ అనుష్కను థియేటర్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం.  స్వీటీకి అభిమానులందరి నుంచి శుభాకాంక్షలు’’ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

‘కథనార్‌’ 14 భాషల్లో విడుదలకానుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తెలుగులో దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటిస్తున్నారని సమాచారం. బలమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని.. ఇందులో సవాల్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని