Arjun Sarja: ఘనంగా అర్జున్‌ కుమార్తె నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్‌

సీనియర్‌ నటుడు, దర్శకుడు అర్జున్‌ తనయ ఐశ్వర్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Published : 28 Oct 2023 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya Arjun) త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు, దర్శకుడు తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు, హీరో ఉమాపతి (Umapathy Ramaiah)తో ఆమె ఏడడుగులు వేయనున్నారు.  శుక్రవారం వారి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. చెన్నైలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిమంది బంధువులు, పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సంబంధిత ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ మారాయి. అటు అర్జున్‌ కుటుంబంగానీ ఇటు తంబి రామయ్య కుటుంబంగానీ ఫొటోలు విడుదల చేయలేదు.

అలా ‘గుంటూరు కారం’లో భాగమయ్యా.. మహేశ్‌కు అన్నీ తెలుసు: మనోజ్‌ పరమహంస

అర్జున్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. ఉమాపతి పుట్టినరోజు సందర్భంగా నవంబరు 8న పెళ్లి తేదీని ప్రకటిస్తామని తంబి రామయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమిళం, కన్నడలో హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించింది ఐశ్వర్య. ఓ తెలుగు సినిమా ఖరారు కాగా అది తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్జున్‌ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా అది. మరోవైపు, అర్జున్‌ కీలక పాత్ర పోషించిన ‘లియో’ థియేటర్లలో సందడి చేస్తోంది. విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని