Avantika Vandanapu: ఇది అన్యాయం.. ట్రోలింగ్‌పై స్పందించిన అవంతిక వందనపు

తనను ట్రోల్‌ చేయడం అన్యాయమని నటి అంతిక వందనపు అన్నారు.

Published : 16 Mar 2024 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  టాలీవుడ్‌ చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీ అయ్యారు నటి అవంతిక వందనపు (avantika vandanapu). ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మీన్‌ గర్ల్స్‌-ది మ్యూజికల్’ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో అవంతిక ఇచ్చిన ఇంటర్వ్యూలపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరిగింది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు.

‘నేను అమెరికాలో పుట్టి పెరిగాను. మేము స్కూల్లో అమెరికన్‌ ఇంగ్లిష్‌, ఇంట్లో ఇండియన్‌ ఇంగ్లిష్‌ మాట్లాడతాం. దీన్ని కోడ్‌ స్విచ్చింగ్ అంటారు. ఈ విషయం తెలియని చాలామంది నన్ను ట్రోల్‌ చేశారు. ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని కామెంట్స్‌ పెట్టారు. ఆ భాష నాకు సహజంగా వచ్చింది. నేను అన్ని ప్రాంతాల్లో తెలుగులో మాట్లాడలేను కదా. తెలుగు అమ్మాయి హాలీవుడ్‌లో విజయం సాధిస్తే ఆదరించాలి. అంతేకానీ మాట్లాడే విధానంపై ట్రోల్‌ చేయడం అన్యాయం. ఎంతోమంది ప్రజలు నన్ను చూసి గర్వపడుతున్నారని భావిస్తున్నా.   నా కుటుంబ అభిప్రాయం మాత్రమే నాకు ముఖ్యం. అందుకే ట్రోల్స్‌ను పట్టించుకోను’ అని అన్నారు.

‘సలార్‌ 2’లో ఆ ఫీల్‌ వందరెట్లు అధికంగా ఉంటుంది: బాబీ సింహా

అమెరికాలోని కాలిఫోర్నియాలో పెరిగిన అవంతిక 2014లో ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ కార్యక్రమంలో రెండో విజేతగా నిలిచారు. దీంతో ఆమెకు ‘బ్రహ్మోత్సవం’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘ప్రేమమ్‌’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘బాలకృష్ణుడు’, ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని