Avikagor: నన్ను నేనే అసహ్యించుకున్నా..: అవికాగోర్‌

బాలనటిగా కెరీర్‌ ఆరంభంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు నటి అవికాగోర్‌. ప్రస్తుతం హీరోయిన్‌, నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలో బొద్దుగ...

Updated : 02 Feb 2022 15:11 IST

హైదరాబాద్‌: బాలనటిగా కెరీర్‌ ఆరంభంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు నటి అవికాగోర్‌. ప్రస్తుతం నిర్మాతగానూ వ్యవహరిస్తోన్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలో బొద్దుగా ఉన్న తాను నాజూకుగా మారడానికి గల కారణాన్ని వెల్లడించారు.

‘‘టీనేజీలో ఉన్నప్పుడు కెరీర్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాను. నాకిచ్చిన పాత్ర గురించే ఆలోచించేదాన్ని. శరీరాకృతిని అస్సలు పట్టించుకోలేదు. ఎలా కనిపిస్తున్నాను? అందరూ నన్ను ఎలా చూస్తున్నారు? అనే విషయాలపై ఎప్పుడూ బాధపడలేదు. అలా, నేను లావుగా మారాను. ఆ తర్వాత కొన్నాళ్లకు అద్దంలో చూసుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డాను. శరీరాకృతి విషయంలో సరైన జాగ్రత్తలు పాటించనందుకు నాపై నాకే అసహ్యంగా అనిపించింది. అలాంటి సమయంలో, కొంతమంది అభిమానులు, శ్రేయోభిలాషులు.. నన్ను ట్రోల్‌ చేయకుండా, వ్యక్తిగతంగా మెస్సేజ్‌లు పెట్టేవాళ్లు. ఆ తర్వాత నేను చాలా రోజులు శ్రమించి ఫిట్‌గా మారాను’’ అని చెప్పుకొచ్చారు ఈ భామ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని