ayushmann khurrana: ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ వారిపై ప్రభావం చూపుతుంది: ఆయుష్మాన్‌ ఖురానా

ఇంటర్నెట్‌ వినియోగం, ట్రోలింగ్‌పై బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా మాట్లాడారు.

Published : 08 Feb 2024 20:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్‌ వినియోగంపై పిల్లలకు అవగాహన కల్పించాలని బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా (ayushmann khurrana) అన్నారు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఇంటర్నెట్‌ వినియోగంపైనా ఆయన మాట్లాడారు. ‘‘ఇంటర్నెట్‌ ఒక శక్తివంతమైన సాధనం. విద్య, ఉద్యోగం, వినోదం, నైపుణ్యాభివృద్ధి.. ఆయా రంగాలకు సంబంధించిన విషయాలను దానిద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ఎంత ఉపయోగం ఉందో అంత ప్రమాదం ఉంది. ఎక్కువమంది స్మార్ట్‌ ఫోన్‌లు, సోషల్‌ మీడియా  వినియోగిస్తున్నారు. ట్రోలింగ్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యం, ఆత్మగౌరవంపైనా ఇది ప్రభావం చూపుతోంది. ట్రోలింగ్‌, బెదిరింపులపై వారికి అవగాహన కల్పించాలి. ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులను సంప్రదించాలని వారికి అర్థమయ్యేలా తెలియజేయాలి. పిల్లలు పాఠశాల దశ నుంచే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. వారిపై బాధ్యతగా వ్యవహరిస్తూ ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ నుంచి సురక్షితంగా ఎలా బయటపడాలో వివరించాలి. వారిలో భయాన్ని పోగొట్టేందుకు వృత్తిపరంగా సహాయం అందించాలి’’ అని ఓ ప్రకటలో ఆయుష్మాన్‌ ఖురానా తెలిపారు. 

‘విక్కీ డోనార్‌’తో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన ఆయుష్మాన్‌ ‘అంధాధున్‌’(Andhadhun)లోని నటనకుగాను జాతీయ అవార్డు అందుకున్నారు. గతేడాది ‘డ్రీమ్‌గర్ల్‌’(Dream Girl)తో అలరించారు. దిగ్గజ క్రికెటర్‌ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నారని సమాచారం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని