Beast: విజయ్‌ పవర్‌ఫుల్ యాక్షన్‌.. ‘బీస్ట్‌’ తెలుగు ట్రైలర్‌ చూశారా..!

విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీజ్‌ కుమార్‌ తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘బీస్ట్‌’. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా తెలుగు, హిందీ ట్రైలర్లను విడుదల చేసింది.

Published : 05 Apr 2022 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘బీస్ట్‌’. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా తెలుగు, హిందీ ట్రైలర్లను విడుదల చేసింది. తెలుగులో విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని పదునైన సంభాషణలు చెప్పించినట్టు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించేలా ఉంది. ఇందులో విజయ్‌ వీర రాఘవన్‌ అనే మాజీ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన పూజాహెగ్డే సందడి చేయనుంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని