అందుకే ఎన్టీఆర్, మహేశ్ గోనగన్నారెడ్డి పాత్ర చేయలేదు
కమర్షియల్ సినిమాలతో పాటు, పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు తీసి, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు
ఇంటర్నెట్‌డెస్క్: కమర్షియల్ సినిమాలతో పాటు, పౌరాణిక, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు తీసి, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. చిరంజీవితో ‘చూడాలని ఉంది’ తీసిన ఆయన మహేశ్‌తో ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ తీశారు. అంతేకాదు, వరుసగా మహేశ్‌తో మూడు సినిమాలు తీసి రికార్డు సృష్టించారు. ఇక ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, రానా, అల్లు అర్జున్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది.
ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర తర్వాత సినిమాకే హైలైట్‌గా నిలిచిన పాత్ర గోనా గన్నారెడ్డి. అల్లు అర్జున్ నటన అటు అభిమానుల్ని, ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్, మహేశ్‌లు కూడా ఆసక్తి చూపారని గుణశేఖర్ ఓ సందర్భంలో చెప్పారు. ‘‘రుద్రమదేవి సినిమా తీయడానికి నాకు స్ఫూర్తిని ఇచ్చిన చిత్రం ‘బ్రేవ్‌హార్ట్’. ఆ స్ఫూర్తితోనే రుద్రమదేవి కథ చేయాలని నాకు అనిపించింది. అయితే, డైరెక్టర్‌గా నాకు మంచి మార్కెట్ ఉన్నప్పుడు చేయాలని అనుకున్నా. ‘ఒక్కడు’ తర్వాత దక్షిణాదిలో ఏ దర్శకుడు తీసుకోలేనంత పెద్ద పారితోషికాన్ని నాకు ఆఫర్ చేశారు. అప్పుడు ‘రుద్రమదేవి’ చేయాలని నిశ్చయించుకుని పలువురు నిర్మాతలకు కథ చెప్పా. ‘కాకతీయుల నేపథ్యంలో గుణశేఖర్ చిత్రం’ అంటూ పేపర్లో ప్రకటన కూడా వచ్చింది. కథ విన్న నిర్మాతలు బాగుందని అన్నారు కానీ, హీరోయిన్ ఓరియెంటెడ్‌గా కాకుండా హీరో నేపథ్యంగా కథ మార్చమని అడిగారు. నేను కుదరదని చెప్పా. అలా ఆ సబ్జెక్ట్ పక్కకు వెళ్లిపోయింది. దాంతో నేనే నిర్మాతగా మారి ‘రుద్రమదేవి’ తీశా’’.
‘‘మహేశ్‌తో ‘ఒక్కడు’ తర్వాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేద్దామనుకున్నాం. దాదాపు సెట్స్‌పైకి వెళ్లాలనుకునేసరికి కథ సరిగ్గా కుదరలేదనిపించింది. ‘రుద్రమదేవి’ అనుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్, మహేశ్పేర్లు బాగా వినిపించాయి. ఎందుకంటే వాళ్లిద్దరితోనూ నేను పని చేశా. వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసు. వాళ్లే స్వయంగా గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఆసక్తి చూపారు. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. అనంతరం అల్లు అర్జున్ ఆ పాత్ర పోషించారు. భవిష్యత్‌లో తప్పకుండా నేనూ-ఎన్టీఆర్ పనిచేస్తాం. అయితే అన్నీ కుదరాలి కదా’’ అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. అన్నట్లు జూన్ 2న గుణశేఖర్ పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన రానా కీలక పాత్రలో హిరణ్యకశ్యప తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్‌కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్‌కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం