Balakrishna: ఆ విషయంలో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్‌

బాలకృష్ణ (Balakrishna) నటించిన సినిమాలు వరుసగా వన్ మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను చేరుకున్నాయి. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Published : 23 Oct 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక ఈ దసరాకు ‘భగవంత్ కేసరి’తో పలకరించిన ఆయన మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ భారీ వసూళ్లు సాధిస్తోంది. విదేశాల్లోనూ అత్యధిక కలెక్షన్ల రాబడుతోంది.

తాజాగా ఈ చిత్రం యూఎస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజుల్లోనే వన్‌ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుందని త్వరలోనే 1.5మిలియన్‌ డాలర్లను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నటించిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు కూడా యూఎస్‌లో వన్ మిలియన్‌ మార్క్‌ను చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ‘భగవంత్‌ కేసరి’ చేరడంతో వరుసగా మూడు సినిమాలతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. అలాగే యూఎస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్లు సాధించిన బాలకృష్ణ నాలుగో సినిమాగా ‘భగవంత్ కేసరి’ నిలిచింది. దీంతో అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.

వీడియో కాల్‌లో రామ్ చరణ్‌ క్షమాపణలు.. ఎందుకంటే!

ఇక అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. ఇందులోని డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉండడంతో అందరూ వాటికి ఫిదా అవుతున్నారు. అలాగే తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక విజ్జి పాపగా శ్రీలీల, కాత్యాయనిగా కాజల్‌ అగర్వాల్ మెప్పించారు. షైన్‌ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ సినిమాను నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని