Bigg Boss OTT: ఓటీటీ ‘బిగ్‌బాస్‌’ వచ్చేస్తున్నాడు.. ప్రోమో అదిరింది..!

24/7 వినోదం పంచేందుకు ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’ సిద్ధమైంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ ఓటీటీలో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

Published : 16 Feb 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడొస్తాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ‘బిగ్‌బాస్‌’ శుభవార్త వినిపించాడు. తానెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడో చెప్పేశాడు. ఇంతకాలం బుల్లితెరపై సందడి చేయగా ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు ఓటీటీలోకి రాబోతున్నాడు. ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ పేరుతో ప్రసారంకానున్న ఈ షోకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ ఓటీటీలో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ నాగార్జున ప్రోమో వీడియోను పంచుకున్నారు. ఇందులో.. ఉరిశిక్ష ఖరారైన ఖైదీ తన చివరి కోరికగా బిగ్‌బాస్‌కి సంబంధించి ఒక్క ఎపిసోడ్‌ను చూడాలనుకుంటాడు. తన కోరిక మేరకు ఈ షోను ప్రసారం చేయగా అది ఎంతకీ పూర్తవదు. ఉరిశిక్ష పడిన ఖైదీగా వెన్నెల కిశోర్‌, పోలీసు అధికారిగా మురళీశర్మ, లాయరుగా నాగార్జున అలరించారు. ఈ ‘బిగ్‌బాస్‌ నాన్‌-స్టాప్‌’ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్‌ల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని