Brahmastra: రూ.100కే ‘బ్రహ్మాస్త్ర’ టికెట్‌.. ఆ నాలుగు రోజులే

‘ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు రావట్లేదు’ అనే మాట కొన్నాళ్లుగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ వినిపిస్తోంది. కొందరు ‘ఓటీటీ’ ప్రభావం అన్నారు. మరికొందరు ‘టికెట్‌ ధరలు’ పెరగటం అని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 26 Sep 2022 02:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు రావట్లేదు’ అనే మాట కొన్నాళ్లుగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ వినిపిస్తోంది. దానికి కారణం ‘ఓటీటీ’ ప్రభావమని కొందరు అన్నారు. ‘టికెట్‌ ధరలు’ పెరగటం అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి, టికెట్‌ ధరలు తగ్గిస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అంటే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. ‘నేషనల్‌ సినిమా డే’ (National Cinema Day) అయిన సెప్టెంబరు 23 అందుకు నిదర్శనం అంటున్నాయి. ‘సినిమా డే’ను పురస్కరించుకుని పలు మల్టీప్లెక్స్‌ల్లో చిత్రాలను రూ.112 (+పన్ను) కే  ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నం సత్ఫలితాలివ్వటంతో ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. అత్యధికంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే మార్గాన్ని ‘నేషనల్‌ సినిమా డే’ తెలిపిందని చెప్పుకొచ్చింది. తమ సినిమాను రూ. 100కే వీక్షించే అవకాశాన్ని సెప్టెంబరు 26 నుంచి సెప్టెంబరు 29 వరకు ఇస్తున్నట్టు ప్రకటించింది. నవరాత్రి ఉత్సవాలను సోమవారం నుంచి ప్రారంభించండి అని పేర్కొంది. రూ.100తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మల్టీప్లెక్స్‌లోనా, సింగిల్‌ స్క్రీన్స్‌లోనా? అనే విషయంలో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ స్పష్టత ఇవ్వలేదు.

బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 9న రిలీజ్‌ అయిన ఈ ఫాంటసీ చిత్రం వసూళ్లు సుమారు రూ. 400 కోట్లకు చేరాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని