Casting Call: ‘గం గం గణేశా’ ఆడిషన్స్‌.. ట్రెండీ పిలుపు!

అన్న విజయ్‌ దేవరకొండ బాటలోనే నడుస్తూ.. తనదైన శైలిలో చిత్రాల ఎంపికతో కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు నటుడు ఆనంద్‌ దేవరకొండ. ఇటీవల ‘పుష్పక విమానం’తో ఓటీటీలో సందడి చేసిన ఈ యువ నటుడు త్వరలో ‘గం గం గణేశా’ చిత్రంతో రాబోతున్నాడు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ ‘హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’

Updated : 18 Feb 2022 10:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్న విజయ్‌ దేవరకొండ బాటలోనే నడుస్తూ.. తనదైన శైలిలో చిత్రాల ఎంపికతో కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు నటుడు ఆనంద్‌ దేవరకొండ. ఇటీవల ‘పుష్పక విమానం’తో ఓటీటీలో సందడి చేసిన ఈ యువ నటుడు త్వరలో ‘గం గం గణేశా’ చిత్రంతో రాబోతున్నాడు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ ‘హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ఈ సినిమాలో కొత్త నటులను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔత్సాహిక నటీనటులకు ఆడిషన్స్‌ నిర్వహించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆనంద్‌ దేవరకొండతో చిత్రబృందం ఓ వీడియోని రూపొందించింది.

వీడియోలో ఆనంద్‌ దేవరకొండ సినిమా అవకాశం కోసం ఆడిషన్స్‌కు రాగా.. ఆడిషన్స్‌ నిర్వాహకులు ఎక్కడో ఒక చోట ఇతన్ని తోసేద్దామనుకుంటారు. దీంతో ఆనంద్‌ ‘నాకు హీరో పాత్ర ఇచ్చేయండి సర్‌.. బాగుంటుంది’అని అంటాడు. ‘ఏదీ ఒక డైలాగు చెప్పు..’అంటూ నిర్వాహకులు అవహేళన చేయడంతో ఒకింత ఆగ్రహానికి గురైనా ఆనంద్‌.. మళ్లీ నవ్వుతూ ‘నేను నేరుగా తెరపై డైలాగులు చెబుతా.. మీరు వేరే పాత్రలకు ఆడిషన్స్ పెట్టుకోండి’’అని చెప్పి వెళ్లిపోతాడు. వినూత్నంగా రూపొందించిన ఈ ఆడిషన్స్‌ ప్రకటన ఆకట్టుకుంటోంది. 

18 నుంచి 55 ఏళ్ల వయసున్న వారిని పాత్రలకు తగ్గట్టు కేటగిరీలుగా విభజించి ఆడిషన్స్‌ నిర్వహించనున్నారు. ఇందుకు కొన్ని కోడ్స్‌ ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు ఆడిషన్స్‌ కోసం వీడియో క్లిప్‌ రూపొందించి.. దానికి కోడ్‌ను జోడించి మార్చి 15లోగా తమకు మెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా పంపించాలని నిర్మాణ సంస్థ కోరుతోంది. కేదార్‌ సెలగమ్‌శెట్టి, వంశీ కరుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని