Dhanush: ఆ ఇద్దరి బయోపిక్స్‌లో నటించాలనుంది: ధనుష్‌

తమిళనటుడు ధనుష్‌ వరుసపెట్టి సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్నాడు. తమిళ చిత్రాల్లోనే కాదు.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ అంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహించిన బాలీవుడ్‌ చిత్రం ‘ఆత్రాంగి రే’ ఓటీటీలో విడుదలైంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన

Updated : 28 Dec 2021 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు ధనుష్‌ వరుసపెట్టి సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్నాడు. తమిళ చిత్రాల్లోనే కాదు.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ అంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహించిన బాలీవుడ్‌ చిత్రం ‘అత్రాంగి రే’ ఓటీటీలో విడుదలైంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ధనుష్‌.. ప్రస్తుతం ఆ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా బయోపిక్‌ల ప్రస్తావన రావడంతో తను ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నాడో వెల్లడించాడు.

ఓ మీడియా సమావేశంలో బయోపిక్‌పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ధనుష్‌ సమాధానమిస్తూ.. అవకాశం వస్తే తాను రజనీకాంత్‌, ఇళయరాజా బయోపిక్స్‌లో నటిస్తానని తెలిపాడు. వారిద్దరూ చిత్రసీమకు ఎంతో సేవ చేశారని, తనకు వారంటే ఎంతో గౌరవమని చెప్పాడు. అందుకే వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలనే కోరిక ఉందన్నాడు. 

‘అత్రాంగి రే’లో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌తో కలిసి ధనుష్‌ నటించాడు. సారా అలీఖాన్‌ కథానాయిక.  ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఆనంద్‌ ఎల్‌. రాయ్‌, భూషణ్‌ కుమార్‌, హిమాన్షు శర్మ, కృష్ణన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. మరోవైపు ధనుష్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ ద్విభాష చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టుకు చిత్ర బృందం ‘సార్‌’(తమిళ్‌లో వాతి) అనే టైటిల్‌ను ఖరారు చేసింది.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని