Kalki 2898 AD: సగం సమయం అందుకే సరిపోతోంది.. ‘కల్కి’ మూవీపై నాగ్‌ అశ్విన్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కల్కి’ మూవీ చిత్రీకరణపై నాగ్‌ అశ్విన్‌ మాట్లాడారు.

Published : 09 Jan 2024 01:54 IST

హైదరాబాద్‌: ‘కల్కి 2989 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ చిత్రీకరణ ఆలస్యమవడానికి గల కారణాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపారు. బాంబే ఐఐటీ టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న ఆయన సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘మేము ఈ సినిమా కోసం ప్రతి దాన్నీ స్క్రాచ్‌ నుంచి తయారు చేస్తున్నాం. ఒకవిధంగా చెప్పాలంటే చిత్రీకరణలో సగం సమయం ఇంజినీరింగ్‌ వర్క్‌కే సరిపోతోంది. ఫిల్మ్‌ మేకింగ్‌ కన్నా కూడా ఆ పనే ఎక్కువ చేస్తున్నానన్న ఫీలింగ్‌ ఉంది. ఈ సినిమాలో మీరు భవిష్యత్‌ ప్రభాస్‌ను చూస్తారు’ అని అన్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడు. దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాబోయే వేసవి కానుకగా ‘కల్కి’ తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. సినిమా సెట్స్‌తో పాటు ఆయుధాలు, ఇతర వస్తువులు సరికొత్తగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ భారతీయ సినిమా పరిశ్రమ చూడని సరికొత్త ప్రపంచాన్ని నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరించబోతున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని