Prabhas: ప్రభాస్‌ ‘కల్కి’లో రామ్‌ గోపాల్‌ వర్మ.. వైరలవుతోన్న షూటింగ్‌ అప్‌డేట్‌!

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రామ్‌ గోపాల్‌ వర్మ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. 

Published : 07 Sep 2023 10:58 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్‌ వర్మ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ అప్‌డేట్ పేరిట సమాచారం నెట్టింట తెగ షేర్‌ అవుతోంది.

ఇప్పటికే ‘కల్కి’లో దర్శకధీరుడు రాజమౌళి ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్నాయి. తాజాగా ఈ సినిమాలో రామ్‌ గోపాల్‌ వర్మ కూడా కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు దర్శకులు వారి పాత్రలకు సంబంధించిన షూటింగ్‌ను కూడా పూర్తి చేశారని అంటున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఇమేజ్‌లంటూ.. కొన్ని ట్విటర్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే, నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటికే అగ్ర తారాగణం ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కోలీవుడ్‌ స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ కూడా భాగమైతే ఈ చిత్రంపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం.

పడ్డాను.. ప్రయత్నించాను..: మీనాక్షి ఆసక్తికర పోస్ట్‌

ఇక మరోవైపు ఈ సినిమా విడుదలపై చిత్రబృందం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది మే నెలలో విడుదల అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని