Aham Brahmasmi: అందుకే ‘అహం బ్రహ్మస్మి’ని పక్కన పెట్టాం: దర్శకుడు శ్రీకాంత్‌

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ‘అహం బ్రహ్మస్మి’పై దర్శకుడు స్పందించారు.

Published : 26 Oct 2023 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు మనోజ్‌ (Manchu Manoj) హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి కొన్నాళ్ల కిత్రం ‘అహం బ్రహ్మస్మి’ (Aham Brahmasmi) చిత్రాన్ని ప్రకటించారు. తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఆ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో ‘లీలమ్మో’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (Leelammo Song Launch Event)లో శ్రీకాంత్‌ తెలిపారు. వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). ఈ సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం వేడుక నిర్వహించి ఆ గీతాన్ని విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ‘అహం బ్రహ్మస్మి’పై ఎదురైన ప్రశ్నకు దర్శకుడు సమాధానం ఇచ్చారు.

* తొలి సినిమాలో ఉన్నంత యాక్టివ్‌గా మీరు తర్వాతి చిత్రాల్లో కనిపించలేదు. ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు?

వైష్ణవ్‌: ఏ దర్శకుడు ఎలా నటించమంటే అలా నేను నటిస్తా. అలా కాకుండా నన్ను నేను నిరూపించుకోవాలని పాత్ర పరిధి దాటి నటించను.

* మీ తొలి చిత్రం ‘ఉప్పెన’ అధిక వసూళ్లు సాధించింది. తర్వాత ఆ స్థాయి సినిమాలు రాకపోవడానికి కారణమేంటి?

వైష్ణవ్‌: సినిమా అంటే సమష్టి కృషి. దాని విజయం విషయంలో కథ ఒక్కటే కాదు..ప్రతిదీ పరిగణనలోకి వస్తుంది.

* మీరు డైరెక్ట్‌ చేసిన షార్ట్‌ఫిల్మ్స్‌లో కామెడీ మెండుగా ఉంటుంది. ఈ సినిమాలో ఆశించొచ్చా?

శ్రీకాంత్‌: తప్పకుండా. ఫస్టాఫ్‌ వినోదాత్మకంగా సాగుతుంది.

* మంచు మనోజ్‌ హీరోగా మీరు ప్రకటించిన ‘అహం బ్రహ్మస్మి’ సినిమాని పక్కన పెట్టడానికి కారణం?

శ్రీకాంత్‌: వ్యక్తిగత సమస్యల వల్ల మనోజ్‌ అన్న సినిమాలో నటించేందుకు కొంతకాలం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఆలోగా నేను మరో చిత్రం పూర్తి చేసి వస్తానని ఆయనకు చెప్పా. పరస్పర అంగీకారంతోనే కొన్నాళ్లు దాన్ని పక్కన పెట్టాం. ఆ ప్రాజెక్టు తప్పకుండా ఉంటుంది.

* ‘ఆదికేశవ’ టైటిల్‌ ఆలోచన ఎవరిది?

శ్రీకాంత్‌: ఏ సినిమాకైనా ముందుగా చాలా పేర్లు అనుకుంటారు. చివరకు ఒకటి ఖరారు చేస్తారు. అలా మా టీమ్‌ అంతా కలిసి ‘ఆదికేశవ’ను ఫిక్స్‌ చేశాం. ఆ టైటిల్‌ ఎందుకు పెట్టామో రివీల్‌ అయిన సమయంలో ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని