GOAT: వాటికి విజయ్‌ సరిపోరంటూ నెటిజన్‌ కామెంట్‌.. దర్శకుడు వెంకట్‌ ప్రభు ఏమన్నారంటే?

విజయ్‌ హీరోగా తాను తెరకెక్కిస్తున్న సినిమాపై ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా దర్శకుడు వెంకట్‌ ప్రభు స్పందించారు.

Published : 01 Jan 2024 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ హీరో విజయ్‌ (Vijay), డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం.. ఆ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. దాన్ని చూసిన పలువురు నెటిజన్లు ‘ఇది హాలీవుడ్‌ మూవీ ‘జెమిని మ్యాన్‌’ (Gemini Man)కు రీమేక్‌లా ఉందే!’ అంటూ కామెంట్లు పెట్టారు. ఓ నెటిజన్‌ అంతటితో ఆగకుండా చిత్ర దర్శకుడు వెంకట్‌ ప్రభు ‘ఎక్స్‌’ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ.. ‘‘విజయ్‌ సర్‌ 2024లోనైనా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. ఒకవేళ మీరేమైనా రీమేక్స్‌ చేస్తుంటే.. హాలీవుడ్‌ చిత్రాల రీమేక్స్‌కు ఆయన సరిపోరని భావిస్తున్నా’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై వెంకట్‌ ప్రభు స్పందిస్తూ.. ‘సారీ బ్రదర్‌. నేను మీ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్‌. ప్రేమను పంచండి’ అంటూ తనదైన శైలిలో బదులిచ్చారు.

జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది: నాగచైతన్య

ఇంతకీ విజయ్‌- వెంకట్‌ ప్రభుల సినిమా పేరేంటంటే.. ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time). సంబంధిత పోస్టర్‌లో వయసు పైబడ్డ వ్యక్తిగా, యువకుడిగా ఫైటర్‌ జెట్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు విజయ్‌. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక ఒక వ్యక్తి జీవితంలోని వేర్వేరు దశలను చూపిస్తున్నారా? అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌కి ఇది 68వ సినిమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని