కరోనా తగ్గిందని తొందరపడకండి.. జాగ్రత్తగా ఉండండి! 

దేశంలో కరోనా రెండోదశతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది పిల్లలు తల్లితండ్రులను పోగొట్టుకుని అభాగ్యలయ్యారు. దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వాలు కృష్టి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా కొవిడ్‌ కేసులు కూడా కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే ‘‘కొవిడ్‌ కేసులు కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి కదాని నిర్లక్ష్యం వహించకండి..నిబంధనలు పాటించమని’’ చెబుతున్నారు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌.

Published : 09 Jun 2021 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  దేశంలో కరోనా రెండోదశతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది పిల్లలు తల్లితండ్రులను పోగొట్టుకుని అభాగ్యలయ్యారు. దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వాలు కృష్టి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా కొవిడ్‌ కేసులు కూడా కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే ‘‘కొవిడ్‌ కేసులు కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి కదాని నిర్లక్ష్యం వహించకండి..నిబంధనలు పాటించమని’’ చెబుతున్నారు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌. తాజాగా తన ట్విటర్‌ ఖాతా ద్వారా కొవిడ్‌పై అలక్ష్యం వద్దని స్పందిస్తూ..‘‘కొవిడ్‌ పరిస్థితులు ఇంకా ఉన్నప్పటికి, కొన్ని ప్రదేశాల్లో  దాని తగ్గుదల కనిపిస్తోంది. అయినంత మాత్రాన అశ్రద్ధ వహించ వద్దు. నిబంధనలు పాటించండి. చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా కడుక్కోండి. మాస్కులు ధరించండి. వ్యక్తికి వ్యకికి మధ్య భౌతిక దూరం పాటించండి. అవసరమైన వాటికి తప్ప అనవసరంగా ప్రయాణాలు చేయకండి. సమయ పరిమితులు పాటించండి. కొవిడ్‌ టీకా వేయించుకోండి’’ అంటూ పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలకు నటుడు అమితాబ్‌ తన తోడ్పాటు అందించారు. అమితాబ్‌ ఇప్పటికే దిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న గురు తేజ్‌బహదూర్‌ కరోనా సంరక్షణ కేంద్రానికి విరాళం ప్రకటించారు. సంరక్షణ కేంద్రంలోని మిగతా ఏర్పాట్ల కోసం రూ. 2 కోట్ల విరాళం అందజేయనున్నట్లు అమితాబ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్‌ ‘చెహ్రే’, ‘మేడే’, ‘గుడ్‌బై’తో పాటు హాలీవుడ్‌ రీమేక్‌ చిత్రం ‘ది ఇంటర్న్‌’లో నటిస్తున్నారు. అన్నే హాత్‌వే పోషించిన పాత్రలో దీపికా పదుకొణె నటిస్తుండగా రాబర్ట్‌ డీ నీరో పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని