‘వి’ టీజర్‌ వచ్చేసింది 

‘ఫూల్స్‌ మాత్రమే రూల్స్‌ గుడ్డిగా ఫాలో అవుతారు సార్‌.. అప్పుడప్పుడూ నాలాంటోడు కొద్దిగా రూల్స్‌ బ్రేక్‌ చేస్తుంటాడంతే’ అని అంటున్నారు నటుడు సుధీర్‌ బాబు. నేచురల్‌ స్టార్‌ నాని, నటుడు సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం...

Updated : 17 Feb 2020 18:08 IST

‘రాక్షసుడి’ని పట్టుకునేందుకు ‘రక్షకుడు’ వచ్చాడు

హైదరాబాద్‌: ‘ఫూల్స్‌ మాత్రమే రూల్స్‌ గుడ్డిగా ఫాలో అవుతారు సార్‌.. అప్పుడప్పుడూ నాలాంటోడు కొద్దిగా రూల్స్‌ బ్రేక్‌ చేస్తుంటాడంతే’ అని అంటున్నారు నటుడు సుధీర్‌ బాబు. నేచురల్‌ స్టార్‌ నాని, నటుడు సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా సుధీర్‌ బాబు.. ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచిన నేపథ్యంలో నేడు తాజాగా ఈ సినిమా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. 

ఇందులో సుధీర్‌, నానిల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌ చివర్లో సుధీర్‌బాబును ఉద్దేశిస్తూ నాని ‘న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్‌ వేయడానికి నేనేమి నీ ఫ్యాన్‌ని కాదురా’, ‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అనే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.  

నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని