jawan: జవాన్‌లో సంజయ్‌దత్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్, నయనతార జోడీగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జవాన్’. ఉత్తరాది, దక్షిణాది తారల క్రేజీ కాంబినేషన్‌లో ముస్తాబవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్, నయనతార జోడీగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జవాన్’. ఉత్తరాది, దక్షిణాది తారల క్రేజీ కాంబినేషన్‌లో ముస్తాబవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ భాగం కానున్నారనే మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ‘సంజయ్‌దత్ పాత్ర నిడివి తక్కువే అయినా.. అత్యంత కీలకమైంది. ముందు ఈ పాత్రకి అల్లు అర్జున్‌ని అనుకున్నా.. ‘పుష్ప 2’లో తను బిజీగా ఉండటంతో కుదరలేదు. ఆ పాత్రని చేయడానికి ఇప్పుడు సంజూబాబా ఒప్పుకున్నారు’ అని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ ఇద్దరూ గతంలో ‘రా వన్’, ‘ఓం శాంతి ఓం’లలో కలిసి నటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని షారుక్ భార్య గౌరి ఖాన్ నిర్మిస్తుండగా.. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జూన్ 2న ఈ చిత్రం విడుదలవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు