వీరి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదంటే?

ఇప్పుడున్న యువ దర్శకులందరికీ గ్లామర్‌ పాఠాలు నేర్పిన దర్శకుడు రాఘవేంద్రరావు. సహాయ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి నటుడిగా, స్టార్‌హీరోగా

Published : 11 Jan 2020 18:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పుడున్న యువ దర్శకులందరికీ గ్లామర్‌ పాఠాలు నేర్పిన దర్శకుడు రాఘవేంద్రరావు. సహాయ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి నటుడిగా, స్టార్‌హీరోగా ఎదిగిన వ్యక్తి ‘మాస్‌ మహారాజ’ రవితేజ. వీరిద్దరూ కెరీర్‌లో అద్భుత విజయాలతో దూసుకెళ్లినా, కలిసి మాత్రం సినిమా చేయలేకపోయారు. అయితే, రాజశేఖర్‌ కథానాయకుడిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలో రవితేజ హీరోకి స్నేహితుడిగా కనిపిస్తాడు. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో ఏ సినిమా రాలేదు. రవితేజ కథానాయకుడిగా మారిన తరువాత ఆయనతో ‘అల్లరి ప్రియుడు’, ‘రౌడీ అల్లుడు’లాంటి సినిమా తీయాలని రాఘవేంద్రరావు అనుకున్నారట. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఆయన కమర్షియల్‌ చిత్రాల బాట నుంచి భక్తి సినిమాల వైపునకు వెళ్లటం రవితేజతో సినిమా తీయలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని