తొలి సినిమా అవకాశానికి ‘నో’

సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన నందమూరి తారక రామారావు ‘మన దేశం’తో తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కానీ అంతకు

Updated : 17 Jan 2020 14:12 IST

సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన నందమూరి తారక రామారావు ‘మన దేశం’తో తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కానీ అంతకు ముందే ఆయనకు ఓ సినిమా అవకాశం వచ్చిందనే సంగతి చాలామందికి తెలియదు. ఆ సినిమా ‘వింధ్యరాణి’. దర్శకుడు సి.పుల్లయ్య. చిత్రమేంటంటే ఆ అవకాశానికి ఎన్టీఆర్‌ నో చెప్పారు. ఎందుకంటే అప్పటికి ఆయన బీఏ చదువుతున్నారు. డిగ్రీ చేతిలో ఉంటే తప్ప సినిమా అవకాశాల కోసం ప్రయత్నించకూడదని నిర్ణయించుకోవడమే కారణం. సినీ రంగం అస్థిరమైందనే అభిప్రాయం వల్ల, ఒకవేళ అందులో రాణించకపోయినా డిగ్రీ ఉంటే ఉద్యోగం చూసుకోవచ్చనేది ఆయన ముందుచూపు. ‘వింధ్యరాణి’  సినిమాలో నటించాలని కోరుతూ పుల్లయ్య ఉత్తరం రాసినా ఇదే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ కనీసం బదులు కూడా ఇవ్వలేదు. అయితే, అప్పటికే నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ను ఎలాగైనా తన సినిమాలో నటింపజేయాలనే పట్టుదలతో పుల్లయ్యే స్వయంగా  విజయవాడ వచ్చారు. ఆయనెంత నచ్చచెప్పినా ఎన్టీఆర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.  చదువు పూర్తి కాకుండానే సినిమాల మీద వ్యామోహంతో ఇంట్లో కూడా చెప్పకుండా రైలెక్కేసే చాలా మంది యువకులకు ఆనాటి ఎన్టీఆర్‌ ముందుచూపు ఓ మార్గదర్శకం అనడంలో సందేహం లేదు.

(కె.చంద్రహాస్‌,  కె.లక్ష్మీనారాయణ రాసిన ‘ఎన్టీఆర్‌ సమగ్ర జీవిత కథ’ పుస్తకం నుంచి...)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని