చిరిగిన బట్టలతో తాళికట్టిన చిరంజీవి

తనదైన నటన, డ్యాన్స్‌లతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి

Published : 16 Feb 2020 15:19 IST

హైదరాబాద్‌: తనదైన నటన, డ్యాన్స్‌లతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి విషయంపైనా అందరితోనూ చర్చిస్తూ తలలో నాలుకలా మసలుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా తన భార్య సురేఖతో కలిసి ఆ వేడుకకు హాజరవుతారు. ఇప్పటివరకూ అలా జంటగా దర్శనమిచ్చిన వీరిద్దరూ కలిసి ఎప్పుడూ మాట్లాడింది లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరు-సురేఖ కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి తన పెళ్లినాటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘సురేఖను నాకు ఇచ్చి వివాహం చేసే విషయంలో అల్లు రామలింగయ్యగారు నా గురించి చాలామందిని ఆరా తీశారు. అయితే, అప్పటికి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకంటే అప్పుడే నా కెరీర్‌ మొదలైంది. రంగుల ప్రపంచంలో వేరే ఆకర్షణలకు లోనవుతానేమోననే భయంతో మా వాళ్లు బలవంతంగా ఒప్పించి పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. మా పెళ్లి కుదిరిన తర్వాత సురేఖతో నేను ఎక్కువగా మాట్లాడలేదు. పెళ్లి విషయంలోనూ కాస్త హడావుడే జరిగింది. ఆ సమయానికి నేను ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నా. అందులో నూతన్‌ ప్రసాద్‌కు నాకూ కొన్ని కీలక సీన్లు ఉన్నాయి. అప్పటికి ఆయన ఫుల్ బిజీ ఆర్టిస్టు కావడంతో ఆయన డేట్స్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకోవల్సి వస్తుందేమోని అనుకున్నాం. కానీ, ఎలాగోలా షూట్‌ను నిర్మాత వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్‌ ఇచ్చారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చొనేటప్పటికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసి సురేఖ ‘వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా’ అని అడిగింది. ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను’’ అని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు చిరంజీవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని