‘హే రామ్‌’ షారుఖ్‌ పారితోషికం ఎంతో తెలుసా?

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన  పీరియడ్‌డ్రామా ఫిల్మ్‌ ‘హే రామ్‌’. షారుఖ్‌ఖాన్‌, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల

Published : 18 Feb 2020 19:03 IST

హైదరాబాద్‌: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన  పీరియడ్‌ డ్రామా ఫిల్మ్‌ ‘హే రామ్‌’. షారుఖ్‌ఖాన్‌, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య ఫిబ్రవరి 18, 2000 విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాదు, కమల్‌ కెరీర్‌లో విభిన్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలై నేటికి 20ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ ట్వీట్ చేశారు. 

‘‘హేరామ్‌’కు 20ఏళ్లు. ఆ సమయంలో ఈ సినిమాను పూర్తి చేయడంసంతోషంగా అనిపించింది. విచారకర విషయం ఏంటంటే, బెదిరింపులు, హెచ్చరికలు వచ్చినా, నిజాన్ని నిర్భయంగా చెప్పిందీ చిత్రం. ఈ సవాళ్లన్నీ అధిగమించి దేశ సామరస్యాన్ని పరిరక్షించే లక్ష్యంలో విజయం సాధిస్తాం’’ అని ట్వీట్‌ చేశారు. 

ఇక ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్‌ కీలక పాత్ర పోషించారు. రామ్‌ (కమల్‌ హాసన్‌) స్నేహితుడు అంజాద్‌ అలీఖాన్‌ పాత్రను పోషించారు. అయితే, ఇందులో షారుఖ్‌చేసిన పాత్ర కోసం ఆయన రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? ఒక్క పైసా కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ స్వయంగా చెప్పారు.  ‘ఈ విషయాన్ని ఎవరూ నమ్మరు. ఇలాంటి కథను, చిత్రాన్ని భవిష్యత్‌లో మళ్లీ చేసే అవకాశం రాదని వారు భావించారు. అయితే, కొందరు మాత్రం ‘షారుఖ్‌ బిజినెస్‌మెన్‌, కమర్షియల్‌ మైండ్‌’ అని చెప్పారు. కానీ, ‘హే రామ్‌’ బడ్జెట్‌ ఏంటో షారుఖ్‌కు తెలుసు. తాను కేవలం సినిమాలో భాగస్వామి మాత్రమే అవ్వాలనుకున్నారు. లేదా కమల్‌తో కలిసి చిన్న సన్నివేశంలో కనిపిస్తే చాలు అని అనుకున్నారు. అనుకున్న బడ్జెట్‌ దాటిపోయినా ఆయన రూపాయి కూడా అడగలేదు. కేవలం నా చేతి గడియారం మాత్రం ఇచ్చాను’’ అని చెప్పుకొచ్చారు. 

2000 విడుదలైన ‘హే రామ్‌’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్‌ కుల్‌కర్ణి, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్‌ విభాగంలో మంత్రకు అవార్డులు వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని