భార్య మీద ప్రేమతో సినిమా ప్రింటు తగలబెట్టేశాడు!

శ్రీమతి అంటే ప్రేమ ఉన్న వారు ఆమె అడిగింది ఎలా కాదనగలరు? నిజమే భార్య కోరిందంటే కొండమీద కోతిని కూడా

Published : 27 Feb 2020 18:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీమతి అంటే ప్రేమ ఉన్న వారు ఆమె అడిగింది ఎలా కాదనగలరు? నిజమే భార్య కోరిందంటే కొండమీద కోతిని కూడా తేవాల్సిందే. అయితే, భార్యపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కోలా చూపుతారు. కొందరు బంగారు ఆభరణాలు కొనిస్తే, ఇంకొందరు ఆమెకు ఇష్టమైన రెస్టారెంట్‌కు తీసుకెళ్లి ట్రీట్‌ ఇస్తారు. కానీ, నటి అయిన తన భార్య అందాన్ని ఎవరూ చూడకూడదని ఓ వ్యక్తి ఏకంగా ఆమె నటించిన సినిమా ప్రింటును తగలబెట్టేశాడు.

1933లో వచ్చిన ఆంగ్ల చిత్రం ‘ఎక్స్‌టసీ’లో నాయిక పాత్రధారిణి హెడీ లామర్‌. అయితే, ప్రేక్షకులు హెడీ గ్లామర్‌ అనేవారు. ఆ సినిమాలో ఆమె గ్లామరే గ్లామరు. సగం దుస్తులతోనూ, దిగంబరంగానూ కూడా ఆమె నటించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. అత్యంత సంపన్నుడైన ఫ్రిట్జ్‌ మండస్‌ అనే ఆసామీ హెడీ లామర్‌ను కలిసి, ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

‘ఎక్స్‌టసీ’లో ఆమె చూపించిన ముప్పావు శరీరాన్నీ, కొలనులోని ఈత కొడుతున్న ఆమె శరీర సౌందర్యాన్ని మోహించిన మండస్‌ ఆమె తన సొంతమే అనుకున్నాడు. అంతే ఆ సినిమా ప్రింటులన్నీ కొనేశాడు. ఇంకొకడెవడూ చూడకుండా అన్నీ తగలబెట్టేశాడు! లాబ్‌ నుంచి ప్రింటు వస్తున్నప్పుడల్లా అంతెత్తు ధనం పోసి ఆ ప్రింటు కొనేయడం, భస్మం చెయ్యడం అదే పని అతగాడికి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని