ప్రేమకథను పంచుకున్న జుహి చావ్లా

అలనాటి అందాల నటి  జుహి చావ్లా..తన కెరీర్‌కి పెళ్లి అడ్డవుతుందని భావించే రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

Published : 17 Mar 2020 23:18 IST

                                                                          

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలనాటి అందాల నటి  జుహి చావ్లా..తన కెరీర్‌కి పెళ్లి అడ్డవుతుందని భావించే రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.  తన కెరీర్‌ ఉన్నతంగా సాగుతోన్న సమయంలోనే అంటే 1996లోనే ప్రముఖ పారిశ్రామికవేత్త  జయ్‌ మెహతాని వివాహమాడింది. అతి కొద్దిమంది  బంధుమిత్రుల సమక్షంలో రహస్యంగా ఆ  పెళ్లి చేసుకుంది.   జుహి ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ ‘నేను అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నన్ను నేను నిరూపించుకుంటున్న సమయమది. అలాంటి సమయంలో పెళ్లి చేసుకోవాల్సి రావడం వల్ల  నా కెరీర్‌ని ఎక్కడ కోల్పోతానో అని భయమేసింది. అందుకే  రహస్యంగా చేసుకోవాల్సి వచ్చింది  ఆ తర్వాత మా అమ్మని కోల్పోవడం నా జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సమయం. 1998లో అమ్మ మరణంతో నేను ప్రేమించిన ప్రతీది కోల్పోతున్నానని అనిపించింది. అలాంటి సమయంలో  జయ్ అండగా నిలబడ్డారు’’ అని తెలిపింది.

జయ్‌తో తన  పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ  నతో తొలిపరిచయం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందే జరిగిందని చెప్పింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల మళ్లీ కలవడం కుదర్లేదని,  కొన్ని సంవత్సరాల తర్వాత ఒక స్నేహితుడు ఇచ్చిన డిన్నర్‌ పార్టీలోనే మళ్లీ కలిసినట్లు గుర్తు చేసుకుంది.. ఆ పార్టీలో కలిసి మాట్లాడుకున్న  మాటలే ఆ తర్వాత  ప్రేమకి దారితీసాయని చెప్పింది. ‘ అప్పటి నుంచే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తను తారసపడేవారు. గులాబీలు, గిఫ్టులతో  ఎదురయ్యేవారు. నా పుట్టిన రోజుకి ఒక ట్రక్ నిండా ఎర్రగులాబీలను కానుకగా పంపించిన  జ్ఞాపకం నాకింకా గుర్తుంది.  సరిగ్గా సంవత్సరం తర్వాత తనే ప్రపోజ్‌ చేశారు’ అని మురిసిపోతూ తన ప్రేమ కథను రాజీవ్ మసంద్‌కి ఇచ్చిన ఇంటర్య్యూలో  పంచుకుంది.  జుహిచావ్లా, జయ్‌ మెహతా జంటకి ఇద్దరు సంతానం కాగా జయ్‌ మెహతాకి జుహీతో ఇది రెండో వివాహం. మొదటి భార్య విమాన ప్రమాదంలో దుర్మరణం చెందింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని