బన్నితో ‘భద్ర’ తీయాలనుకున్నారు కానీ..

రవితేజ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భద్ర’. ఈ సినిమాతోనే బోయపాటి దర్శకుడిగా పరిచయం

Published : 12 May 2020 11:01 IST

హైదరాబాద్‌: రవితేజ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భద్ర’. ఈ సినిమాతోనే బోయపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు. రవితేజ నటన, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, బోయపాటి దర్శకత్వ శైలి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సినిమా విడుదలై మే 12 తేదీకి 15ఏళ్లు పూర్తయ్యాయి. ‘భద్ర’ సినిమాతో బోయపాటి రూపంలో ఒక మాస్‌ దర్శకుడు దొరికాడు.

అల్లు అర్జున్‌తో తీయాలనుకున్నారు!

‘భద్ర’ సినిమాను తొలుత అల్లు అర్జున్‌తో తీద్దామని బోయపాటి అనుకున్నారు. ఇదే విషయాన్ని బన్నికి చెబితే, ఆయనకు కూడా కథ నచ్చింది. అయితే, ఒక అభ్యంతరం చెప్పారు. ఇంత మాస్‌, ఎమోషనల్‌ సినిమా మోసేంత అనుభవం తనకు లేదని చెప్పారు. ఎందుకంటే అప్పటికి అల్లు అర్జున్‌ ‘గంగోత్రి’, ‘ఆర్య’ చిత్రాలు మాత్రమే చేశారు. దీంతో దిల్‌రాజుకు  బోయపాటిని పరిచయం చేసి, కథ వినమని కోరారు. బోయపాటి కథ చెప్పిన విధానం నచ్చింది. దీంతో రవితేజ కథానాయకుడిగా సినిమా పట్టాలెక్కింది. అలా దర్శకుడిగా బోయపాటి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ‘తులసి’, ‘సింహా’ చిత్రాలతో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ‘సరైనోడు’తో తెరకెక్కించి ఎట్టకేలకు అల్లు అర్జున్‌తో సినిమా తీశారు.

ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. లాక్‌డౌన్‌ కారణంగా విరామం తీసుకున్నారు. ఇందులో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తారని బోయపాటి చెప్పారు. మరి మాస్‌లో మంచి క్రేజ్‌ ఉన్న బాలయ్యను బోయపాటి ఈ సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని