దర్శకులు మారారు... కథా మారింది

కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ చిత్రాన్ని తెలుగులో తీయాలని బి.నాగిరెడ్డి నిర్ణయించుకున్నారు.

Updated : 11 Jul 2023 15:30 IST

కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ చిత్రాన్ని తెలుగులో తీయాలని బి.నాగిరెడ్డి నిర్ణయించుకున్నారు. డి.వి.నరసరాజు చేత స్క్రిప్ట్‌ రాయించారు. సోదరుడు బి.ఎన్‌.రెడ్డికి దర్శకత్వం అప్పగించబోయి, కళాత్మక చిత్ర దర్శకుడితో రీమేక్‌ చేయించడం ఇష్టం లేక పి.పుల్లయ్యను సంప్రదించారు. అయితే ఆయనకి కథ నచ్చలేదు. కానీ  నాగిరెడ్డి తగ్గలేదు. ఎలాగైనా ‘మనె తుంబిద హెణ్ణు’ చిత్రాన్ని తెలుగులో తీయాలన్న పట్టుదలతో తన సహనిర్మాత చక్రపాణికి ఆ ప్రాజెక్ట్‌ను బలవంతంగా అప్పగించారు. కన్నడ కథ చూస్తూనే పెదవి విరిచిన చక్రపాణి పనిగట్టుకుని మూల కథను ఓ మూల పెట్టి,  నరసరాజు చేత మొత్తం స్క్రిప్ట్‌ తిరగ రాయించారు. కమలాకర కామేశ్వర రావును దర్శకుడిగా, సూర్యకాంతాన్ని ప్రధాన పాత్రలో తీసుకుని, ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, ఎస్వీఆర్‌, రమణారెడ్డి, సావిత్రి, జమున లాంటి భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. అలా ముందు దర్శకులూ, ఆ తర్వాత కథా మారి తిరుగులేని విజయం సాధించిన చిత్రమే విజయా వారి ‘గుండమ్మ కథ’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని