వి.వి.వినాయక్‌ రూ.ఐదు లక్షల విరాళం

కరోనా విళయతాండవం చేస్తోన్న తరుణంలో దాని నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో సినీ పరిశ్రమపైనే ఆధారపడిన పలువురు పేద కళాకారులు...

Published : 25 Mar 2020 18:31 IST

నిత్యావసర వస్తువులు కావాలంటే ఆయన్ని కలవండి

హైదరాబాద్‌: కరోనా విళయతాండవం చేస్తున్న తరుణంలో దాని నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో సినీ పరిశ్రమపైనే ఆధారపడిన పలువురు పేద కళాకారులు ప్రస్తుతం కుటుంబపోషణ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో టాలీవుడ్‌ దర్శకుడు, నటుడు వి.వి.వినాయక్‌ పేద కళాకారులకు తన వంతు సాయం చేశారు. రూ.5 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన రూ.ఐదు లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కు అందిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసరాలు కావల్సిన పేద కళాకారులు ఆయన్ని సంప్రదించాలని వినాయక్‌ కోరారు.

‘అందరికీ నమస్కారం.. నేను మీ వి.వి వినాయక్‌. ప్రస్తుతం మనల్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. కానీ మనందరం ఇళ్లల్లో ఉండి ఆ మహమ్మారిని వణికించాలి. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌ లేకపోవడంతో పరిశ్రమలో ఉన్న పేద కళాకారులు, ఫైటర్స్‌, డ్యానర్స్ ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి కుటుంబ పోషణకు అవసరమైన నిత్యావసరాలను కొని పేద కళాకారులకు అందించాలని కోరుకుంటూ నేను రూ.5 లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కి అందిస్తున్నాను. నిత్యావసర వస్తువులు అవసరం ఉన్న వారు ఆయన్ని కలిసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని వి.వి.వినాయక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని