ప్రేయసి ఫొటో షేర్‌ చేసిన రానా

టాలీవుడ్‌ కథానాయకుడు రానా దగ్గుబాటి మంగళవారం ఓ పోస్ట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసి.. ‘ఆమె ఓకే చెప్పింది’ అంటూ షాక్‌ ఇచ్చారు. ఆమె పేరు మిహీకా బజాజ్‌ అని తెలిపారు. ఈ ఫొటోకు తెగ కామెంట్లు, లైక్‌లు వచ్చాయి. అందరూ రానాకు.....

Updated : 12 May 2020 19:53 IST

ఆమె నా ప్రేమకు ఓకే చెప్పింది

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు రానా దగ్గుబాటి మంగళవారం ఓ పోస్ట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసి.. ‘ఆమె ఓకే చెప్పింది’ అంటూ షాక్‌ ఇచ్చారు. ఆమె పేరు మిహీకా బజాజ్‌ అని తెలిపారు. ఈ ఫొటోకు తెగ కామెంట్లు, లైక్‌లు వచ్చాయి. అందరూ రానాకు శుభాకాంక్షలు చెప్పారు. కథానాయికలు సమంత, శ్రుతి హాసన్‌, హన్సిక, రాశీ ఖన్నా, కియారా అడ్వాణీ శుభాకాంక్షలు చెప్పారు. ‘ఓమైగాడ్‌.. కంగ్రాట్స్‌’ అని రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కామెంట్‌ చేశారు. ‘మై మెన్‌.. శుభాకాంక్షలు.. ఎంగేజ్డ్‌ గ్యాంగ్‌లోకి నీకు స్వాగతం’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. నితిన్‌ను కూడా ట్యాగ్‌ చేశారు. త్వరలోనే రానా పెళ్లి కుమారుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. రానా ఈ ఫొటో షేర్‌ చేసిన 15 నిమిషాల్లోనే దాదాపు 45 వేల మంది లైక్‌ చేయడం విశేషం. మిహీకా బజాజ్‌ స్వస్థలం హైదరాబాద్‌. ఆమె ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నారు.

‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ తర్వాత రానా ‘హౌస్‌ఫుల్‌ 4’లో సందడి చేశారు. ఆపై ‘అరణ్య’లో నటించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా పడింది. మరోవైపు ఆయన ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రానా నటించిన ‘1945’ విడుదల కావాల్సి ఉంది.

‘‘కంగ్రాట్స్‌ మై బాయ్‌ రానా. ఎట్టకేలకు బలశాలి అయిన భళ్లాలదేవుడు మన్మథుడికి చిక్కాడు. లాక్‌డౌన్‌ కాస్త వెడ్‌లాక్‌ అయింది. మీ ఇద్దరికీ నా దీవెనలు. శతమానం భవతి మిహికా బజాజ్‌’’ -ట్విటర్‌లో చిరంజీవి

‘‘ఇప్పుడు అందరికీ తెలిసి పోయింది. భళ్లాలదేవుడి భార్య ఎవరో’’ - నిర్మాత శోభు యార్లగడ్డ

‘‘శుభాకాంక్షలు బిగ్‌ మ్యాన్‌.. నీ జీవితంలో అతి పెద్ద, అందమైన మలుపుతీసుకుంది’’ -సుధీర్‌బాబు

‘‘ఇది ఒక కల. ఓకే గుడ్‌నైట్‌ మళ్లీ పడుకొంటున్నా’’-సాయిధరమ్‌ తేజ్‌

‘‘శుభాకాంక్షలు బ్రదర్‌.. మా గ్యాంగ్‌లోకి స్వాగతం.. సుస్వాగతం’’ -నితిన్‌

‘‘కంగ్రాట్స్‌ మై బెస్ట్‌ మస్కటీర్‌. ఇది చాలా సంతోషకరమైన ప్రకటన’’ -మంచు లక్ష్మి

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు