Bhimaa: మంచి యాక్షన్‌ హంగామా చూస్తారు: గోపీచంద్‌

టాలీవుడ్‌ కథానాయకుడు గోపీచంద్‌ కొత్త చిత్రం ‘భీమా’ ప్రీరిలీజ్‌ వేడుక వరంగల్‌లో నిర్వహించారు.

Published : 03 Mar 2024 16:56 IST

హైదరాబాద్‌: గోపీచంద్‌ (Gopichand) కథానాయకుడిగా ఎ.హర్హ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమా’ (Bhimaa). ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో గోపీచంద్‌ పోలీసు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో గోపీచంద్‌ మాట్లాడారు.

‘‘కొన్నేళ్లుగా నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. ‘వర్షం’ నుంచి భీమా వరకూ అదే ప్రేమను అందిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఫైట్స్‌, మ్యూజిక్‌, డైలాగ్స్‌ చాలా బాగున్నాయి.  షూటింగ్‌ మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకూ చాలా ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేశాం. భీమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. స్వతహాగా సినిమాలపై స్టేట్‌మెంట్‌లు ఇవ్వను. ఈ చిత్రం అందరి అంచనాలు నిజం చేస్తూ మంచి విజయం సాధిస్తుంది. మార్చి 8న మీరందరూ మంచి యాక్షన్‌ హంగామ చూస్తారు. అందులో సందేహం లేదు ’’అని గోపీచంద్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని