Mahesh Babu: ‘గుంటూరు కారం’ రికార్డు.. ఎక్కడంటే!

మహేశ్‌ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. అమెరికాలో 5,408 ప్రీమియర్‌ షోలు వేయనున్నారు.

Updated : 06 Jan 2024 12:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’(Guntur Kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని లిరికల్‌ సాంగ్స్‌ లక్షల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షో విషయంలో రికార్డు సృష్టించింది.

‘గుంటూరు కారం’ కోసం జనవరి 11న అమెరికాలో 5,408 ప్రీమియర్‌ షోలు వేయనున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇన్ని షోలు వేయడం రికార్డని చిత్రబృందం తెలిపింది. తాజాగా దీని విజయంపై నిర్మాత మరోసారి ధీమా వ్యక్తం చేశారు. సినిమా అద్భుతంగా వచ్చిందని.. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుందన్నారు.

ఇక నేడు జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా వేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీసులైన్స్‌లో దీని కోసం నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కల్పించడం సాధ్యంకాదని పోలీసులు దీనికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని