Hansika: హన్సిక పెళ్లిలో ప్రత్యేక అతిథులు వీరే.. వాళ్లెవరూ సెలబ్రిటీలు కాదు

హన్సిక వివాహం నేడు. రాజస్థాన్‌లోని రాజకోట వేదికగా ఆమె సోహైల్‌తో ఏడడుగులు వేయనున్నారు.

Published : 04 Dec 2022 10:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘దేశముదురు’తో వైశాలిగా తెలుగువారిని అలరించిన ముద్దుగుమ్మ హన్సిక (Hansika) వివాహం నేడు. తన ప్రియుడు సోహైల్‌తో ఆమె మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జైపుర్‌లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు ఆహ్వానాలు అందాయి. అయితే వాళ్లు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రిటీలు మాత్రం కాదు.. నిరుపేద చిన్నారులు.

హన్సికకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమంటే ఎంతో ఇష్టం. పలు ఎన్జీవోలతో కలిసి నిరుపేద చిన్నారులకు చేతనైనంత సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తన వివాహానికి ఆయా ఎన్జీవోలకు చెందిన పలువురు చిన్నారులకూ ఆహ్వానాలు పంపించింది. తమని ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ఆహ్వానించిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ చిన్నారులు ఓ వీడియో క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆమె మంచి మనసుని మెచ్చుకుంటున్నారు. అలాగే, వివాహ వేదిక పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారులకు ఆమె ఈ రోజు భోజనాన్ని పంపించనున్నారు.

ప్రీ వెడ్డింగ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టిన జోడీ

ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో భాగంగా శనివారం హన్సిక - సోహైల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఆయా వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి.









Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు