Harrypotter: ‘హ్యారీపోటర్’ రూబస్ మృతి
సూపర్‌హిట్ ‘హ్యారీపోటర్’ చిత్రాల్లో రూబస్ హగ్రిడ్‌గా ప్రపంచానికి చిరపరిచితుడైన నటుడు రాబీ కోల్ట్రేన్ (72) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల హాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో నివాళులు వెల్లువెత్తాయి. ‘కొల్ట్రేన్ అత్యంత ప్రతిభావంతుడు.
సూపర్‌హిట్ ‘హ్యారీపోటర్’ (Harry Potter) చిత్రాల్లో రూబస్ హగ్రిడ్‌గా ప్రపంచానికి చిరపరిచితుడైన నటుడు రాబీ కోల్ట్రేన్ (72) (Harrypotter) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల హాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో నివాళులు వెల్లువెత్తాయి. ‘కొల్ట్రేన్ అత్యంత ప్రతిభావంతుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు రచయిత్రి జేకే రౌలింగ్. ‘రాబీ సరదా మనిషి. సెట్లో చిన్న పిల్లాడిలా ఉంటూ అందర్నీ నవ్వించేవారు. అలాంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకర విషయం’ అని బాధ వ్యక్తం చేశాడు ‘హ్యారీపోటర్’ కథానాయకుడు డేనియల్ రాడ్‌క్లిఫ్. ‘ఎల్లప్పుడూ సరదాగా ఉండటమే కాదు.. సొంత అంకుల్‌లా నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవాడు’ అంటూ ఆయనతో ఉన్న అనుబంధం పంచుకుంది కథానాయిక ఎమ్మా వాట్సన్. రాబీ కోల్ట్రేన్ జేమ్స్‌బాండ్ ‘గోల్డెన్ ఐ’, ‘ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్’ చిత్రాల్లోనూ నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి