SIIMA 2023 Nominations: సైమా అవార్డ్స్‌ 2023.. ‘ఆర్ఆర్ఆర్‌’కు 11 నామినేషన్స్‌..!

SIIMA 2023 Nominations: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 (SIIMA 2023)లో పోటీపడే చిత్రాల జాబితా విడుదలైంది. ఉత్తమ చిత్రం సహా పలు కేటగిరిల్లో ఏయే సినిమాలు బరిలో ఉన్నాయో చూసేయండి

Published : 02 Aug 2023 01:55 IST

హైదరాబాద్‌: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకల్ని (SIIMA 2023 Nominations) ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. తర్వాత 10 కేటగిరిల్లో ‘సీతారామం’కి నామినేషన్స్‌ దక్కాయి. ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’, నిఖిల్‌ మిస్టరీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘కార్తికేయ2’, అడవి శేష్‌ ‘మేజర్‌’లతో పాటు డీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘సీతారామం’ పోటీ పడుతున్నాయి. దుబాయ్‌లోని డి.డబ్ల్యూ.టి.సిలో సైమా వేడుక జరగనుంది.

ఇక తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ (Ponniyin Selvan:1) చిత్రానికి దక్కాయి. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్‌’ (Vikram) 9 నామినేషన్స్‌ను దక్కించుకుంది. కన్నడలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన రిషబ్‌శెట్టి ‘కాంతార’ (Kantara), యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ మాస్‌, యాక్షన్‌ మూవీ ‘కేజీయఫ్‌2’ (KGF Chapter 2)లకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. మలయళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్‌ నీరద్‌ దర్శకత్వంలో మమ్ముటి నటించిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) చిత్రానికి 8 నామినేషన్స్‌ రాగా, టోవినో థామస్‌ థల్లుమాల (Thallumaala)కు ఏడు నామినేషన్స్‌ వచ్చాయి. తెలుగుతో పాటు, కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ఇక్కడ చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని