Valentines Day: పరిచయం + ప్రేమ + వదంతులు = పెళ్లి!... సినిమాను తలపించే స్టార్ జోడీల ప్రేమకథలు
Valentines Day... ప్రేమంటే సులువు కాదని అంటుంటారు సినీ కవులు. మరి, అలాంటి ప్రేమలో విజయం సాధించి, ఆనందంగా జీవిస్తోన్న పలువురు స్టార్ జోడీల ప్రేమకథలు ‘ప్రేమికుల దినోత్సవం’ (Valentines Day Special) ప్రత్యేకంగా మీకోసం..!
ఇంటర్నెట్‌డెస్క్: అబ్బాయి, అమ్మాయి.. అనుకోకుండా పరిచయం కావడం, వాళ్ల మధ్య మాటలు కలవడం, స్నేహం, ఆ వెంటనే ప్రేమ.. ఇంట్లో వాళ్లకు చెప్పేలోపు వాళ్లిద్దరి గురించి ఎన్నో వదంతులు, గొడవలు.. చివరికి పెద్దల అంగీకారంతో శుభం కార్డు పడటం.. ఇలాంటి ప్రేమకథలను వెండితెరపై మనం ఎన్నోసార్లు చూశాం. అయితే, ఇలాంటి ప్రేమకథలే మన వెండితెర స్టార్‌జోడీల రియల్‌లైఫ్‌లోనూ ఉన్నాయి. పలు చిత్రాల్లో నటించి బెస్ట్ రీల్ కపుల్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పలువురు నటీనటులు.. రియల్‌లైఫ్‌లోనూ తమ బంధాన్ని కొనసాగించారు. ఇంతకీ ఆ స్టార్‌జోడీలు ఎవరు? వారి ప్రేమకథలు ఏమిటి? (Valentines Day Special)
సినిమాతో కలిసి.. కెరీర్‌ని వదిలి..!
‘వంశీ’(Vamsi)తో మొదటిసారి పరిచయమయ్యారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu), నటి నమ్రతా శిరోడ్కర్ (Namrata Shirodkar). ఈ సినిమా షూట్‌లో ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. సినిమా కోసం కుటుంబానికి దూరంగా ఉన్న నమ్రతలో ధైర్యం నింపి.. ఆమెను సంతోషంగా ఉంచడం కోసం మహేశ్ తరచూ డిన్నర్ డేట్స్‌కు తీసుకువెళ్లేవారు. అలా, ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడి.. అనుబంధం మరింత బలపడింది. అప్పట్లో వీరిద్దరి గురించి ఎన్నో వదంతులు వచ్చినప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా కుటుంబసభ్యుల అంగీకారంతో 2005లో ఈ జోడీ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. వివాహం అనంతరం నమ్రత (Namrata) సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. మహేశ్ కోరిక మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఎన్నో సార్లు చెప్పారు. (Valentines Day Special)
ఏడేళ్ల ప్రయాణం.. ఏడడుగుల బంధంగా..!
దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉన్న తారల్లో నయనతార (Nayanthara) ఒకరు. దర్శకుడు విఘ్నేశ్ శివన్(Vignesh Shivan)తో ఆమె గతేడాది ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే, వీరి ప్రేమకథ ఈనాటిది కాదు. 2015లో తెరకెక్కిన ‘నేనూ రౌడీనే’ సినిమా వీరిద్దర్నీ ఒక్కటి చేసింది. నయన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ దర్శకుడు. ఈ సినిమా షూట్‌లోనే నయన్‌పై విఘ్నేశ్‌కు ప్రేమ ఏర్పడింది. అప్పటికే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె.. విఘ్నేశ్ ప్రేమను అర్థం చేసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పెద్దల అంగీకారంతో సుమారు ఏడేళ్ల తమ ప్రేమను 2022లో వివాహబంధంగా మార్చుకున్నారు. వ్యక్తిగతమైన, వృత్తిపరమైన విషయాల్లో నయన్ తనకి ఎప్పుడూ అండగా ఉంటుందని విఘ్నేశ్ తరచూ చెబుతుంటారు. (Valentines Day Special)
కోపతాపాలు.. ప్రేమగా మారితే..!
అజిత్ (Ajith), షాలినీ (Shalini) కలిసి నటించిన తొలి సినిమా ‘అమర్‌కాలం’ (Amarkalam). పరీక్షల కారణంగా ఈ చిత్రాన్ని వదులుకోవాలనుకున్న షాలినీ.. అజిత్ మాటతో ఇందులో భాగమయ్యారు. ఈ సినిమా ప్రారంభం కావడానికంటే ముందు.. అజిత్ నటించిన ఓ సినిమా ఈవెంట్‌లో షాలినీ పాల్గొన్నారు. ఇందులో తన జుట్టును కామెంట్ చేయడంతో అజిత్‌పై ఆమె కోపం తెచ్చుకున్నారు. ఇక, ‘అమర్‌కాలం’ షూట్‌లో అజిత్ ప్రమాదవశాత్తు ఆమె చేతికి గాయం చేశాడు. ఈ ఘటనతో బాధపడిన ఆయన.. అనుక్షణం ఆమెను కంటికి రెప్పలా కాపాడారు. ఆయనలోని ఆత్మీయతను అర్థం చేసుకున్న ఆమె.. రీల్ బంధాన్ని రియల్ లైఫ్‌లోనూ కొనసాగించారు. (Valentines Day Special)
ఆ దూరమే దగ్గర చేసింది..!
పూవెల్లం కెట్టుపర్ (Poovellam Kettuppar) సినిమా కోసం మొదటిసారి కలిసి పనిచేశారు పంజాబీ కుటుంబానికి చెందిన జ్యోతిక (Jyothika).. తమిళనాడుకు చెందిన సూర్య (Suriya). ఈ సినిమా షూట్‌లోనే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరిగింది. ప్రేక్షకులు సైతం ఈ జోడీకి మంచి మార్కులు వేయడంతో వీరిద్దరూ కలిసి ‘కాఖా కాఖా’ తో మరోసారి జట్టుకట్టారు. కొంతకాలానికి ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. ఆ సమయంలోనే వీరిద్దరికీ పెళ్లి చేసుకుని దగ్గరవ్వాలనే భావన కలిగింది. అలా, ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకున్నారు. సంప్రదాయాలు వేరైనప్పటికీ పెద్దల అంగీకారంతో 2006లో పెళ్లి చేసుకున్నారు. (Valentines Day Special)
బాలీవుడ్‌లోనూ..!
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. మానసిక ఒత్తిడికిలోనైన దీపికా పదుకొణె (Deepika Padukone)కు.. ‘రామ్‌లీలా’ (Ram Leela)తో పరిచయమై నేనున్నానంటూ భరోసానిచ్చారు నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh). నాలుగేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’తో చేరువై.. జీవితాన్ని పంచుకున్నారు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) - అలియా భట్ (Alia Bhatt). ‘షేర్షా’ సినిమా కోసం పనిచేసి కొన్ని నెలల్లోనే మూడుముళ్ల బంధంలోకి వచ్చారు కియారా అడ్వాణీ (Kiara Advani) - సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra). ఇలా పలువురు నటీనటులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని.. చివరికి తమ పర్‌ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్‌ను ఎంచుకుని సంతోషంగా జీవిస్తున్నారు. (Valentines Day Special)
సినిమా వాళ్లు కాదు.. కానీ..!
రామ్‌చరణ్ - ఉపాసన, అల్లు అర్జున్ - స్నేహారెడ్డి, నిఖిల్ - పల్లవి, నితిన్ - షాలినీ, రానా - మిహికా, హన్సిక - సోహైల్, సోనమ్ కపూర్ - ఆనంద్.. ఇలా పలువురు నటీనటులు, తమ రంగంతో సంబంధం లేని వారిని ప్రేమించి పెళ్లాడారు. మరోవైపు, నాగార్జున - అమల, చిన్మయి - రాహుల్, అట్లీ - ప్రియ, కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్, ఆదిపినిశెట్టి - నిక్కీ గల్రానీ, యామీ గౌతమ్ - ఆదిత్య, సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్ వంటి తారలు ప్రేమ వివాహం చేసుకున్నవారే. (Valentines Day Special)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
North Korea: కిమ్‌కు ఎదురుదెబ్బ.. విఫలమైన నిఘా ఉపగ్రహ ప్రయోగం..!
-
General News
Tirupati: తిరుపతి జూలో పెద్దపులి పిల్ల మృతి
-
General News
Road Accident: పుష్ప-2 షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!