Nani: నేనేమీ ఓవర్‌నైట్‌లో స్టార్‌ కాలేదు.. : హీరో నాని

‘అష్టా-చమ్మా’ సినిమాతో అలరించినా, ‘అంటే సుందరానికి!’ అంటూ అందరినీ నవ్వించినా, ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో అందరినీ ఎమోషన్‌కు గురిచేసినా అది హీరో నానికే సాధ్యం.

Published : 21 Sep 2022 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అష్టా-చమ్మా’ సినిమాతో అలరించినా, ‘అంటే సుందరానికి!’ అంటూ అందరినీ నవ్వించినా, ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో అందరినీ ఎమోషన్‌కు గురిచేసినా అది హీరో నానికే సాధ్యం. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ యంగ్‌ హీరో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 14 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా నాని తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘2005లో ‘రాధాగోపాలం’ సినిమాకు దర్శకుడు బాపుతో కలిసి పనిచేశాను. మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టా. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నా. కొన్ని రోజులు రేడియో జాకీ(RJ)గా  పనిచేశా. ఆ తర్వాత కొన్ని ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 2008లో విడుదలైన ‘అష్టా-చమ్మా’ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇదంతా ఒకరాత్రిలో వచ్చింది కాదు. ఎంతో కష్టపడ్డాను. నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంతమంది అభిమానుల ప్రేమ, అప్యాయతలు నాకు దక్కుతున్నాయంటే  నిజంగా నేను అదృష్టవంతుడిని అనుకుంటాను’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని