Siddharth: నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.. ‘ఇండియన్‌2’ పై సూపర్‌ న్యూస్‌ చెప్పిన సిద్దార్థ్‌

కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఇండియన్‌-2’. తాజాగా ఈ చిత్రం గురించి సిద్దార్థ్‌ (Siddharth) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 01 Jun 2023 11:31 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఇండియన్‌-2’ (Indian 2). శంకర్‌ దర్శకత్వంలో మల్టీటాలెంటెడ్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం అప్‌డేట్స్‌ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు ప్రేక్షకులు ఏస్థాయి విజయం అందించారో తెలిసిందే. త్వరలో రానున్న దాని సీక్వెల్‌ కూడా అంచనాలకు మించి ఉంటుందని హీరో సిద్దార్థ్‌ (Siddharth) అన్నారు.

‘ఇండియన్‌ 2’ సినిమాలో సిద్దార్థ్‌ (Siddharth) ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమల్‌ హాసన్‌ అంటే తనకెంత గౌరవమో తెలిపారు. అలాగే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. ‘‘ఇండియన్‌ 2’ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక గొప్ప చిత్రం అవుతుంది. శంకర్‌ (Shankar) వంటి గొప్ప దర్శకుడి దగ్గర 20 సంవత్సరాల తర్వాత పనిచేయడం నా అదృష్టం. నాకు కమల్‌ హాసన్‌ అంటే ఎంతో అభిమానం. ఆయన నా మానసిక గురువు. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని. దూరం నుంచి ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో ఆయనతో కలిసి చేయడం నాకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాలో నటించాలన్నది నా కల. దీంతో అది నిజమైంది. ఈ సినిమా గురించి ఒకటి కచ్చితంగా చెబుతాను. మీరు దీని గురించి ఎంత ఊహించినా.. మీ ఊహలకు మించి ఉంటుంది’’ అని చెప్పారు.

1996లో విడుదలైన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రానుంది. ఇందులో కమల్‌ హాసన్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను శంకర్‌ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. అందుకే బ్యాక్‌ టు బ్యాక్‌ షెడ్యూళ్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని