IB71 ott release date: ఓటీటీలో విద్యుత్‌ జమ్వాల్‌ ‘ఐబీ71’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇటీవల కాలంలో వరుసగా స్పై చిత్రాలు బాక్సాఫీస్‌ను పలకరించాయి. ఇక ముందూ మరికొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. అలా ఈ ఏడాది మేలో థియేటర్‌లలో విడుదలైన స్పై థ్రిల్లర్‌ ‘ఐబీ71’ (IB71).

Published : 24 Jun 2023 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల కాలంలో వరుసగా స్పై చిత్రాలు బాక్సాఫీస్‌ను పలకరించాయి. ఇక ముందూ మరికొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. అలా ఈ ఏడాది మేలో థియేటర్‌లలో విడుదలైన స్పై థ్రిల్లర్‌ ‘ఐబీ71’ (IB71). విద్యుత్‌ జమ్వాల్‌ (Vidyut Jammwal) కీలక పాత్రలో తెలుగు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి దీన్ని తెరకెక్కించారు. రివ్యూల పరంగా మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జులై 7వ తేదీ నుంచి ‘ఐబీ 71’ స్ట్రీమింగ్‌ కానుంది. కేవలం హిందీలోనే విడుదల చేస్తారా? తెలుగు ఆడియో అందుబాటులో ఉంటుందా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది. 1971లో జరిగిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ హైజాకింగ్‌ ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. విద్యుత్‌ జమ్వాల్‌ ఇందులో ఐబీ ఏజెంట్‌గా నటించారు. విశాల్‌ జత్వా, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు