Celebrity weddings: ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన తారలు.. ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువ!
2022లో సినీ నటుల్లో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో ఓ లుక్కేయండి. ఇందులో మీ అభిమాన నటులున్నారేమో చూసేయండి..
ఇంటర్నెట్ డెస్క్: ఎవరికైనా తాము పుట్టిన సంవత్సరం ఎంత ప్రత్యేకమో పెళ్లి చేసుకున్న సంవత్సరం అంతే ప్రత్యేకంగా నిలుస్తుంది. అలా 2022 పలువురు సినీ తారలకు స్పెషల్ అయింది. వీటిల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు ఉండటం విశేషం. మరి, ఆ తారల వెడ్డింగ్ మెమొరీస్‌ను ఓసారి గుర్తు చేసుకుందామా..
అలియా 💙 రణ్‌బీర్
కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న బాలీవుడ్ నటులు అలియాభట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు తాము ఎక్కువగా ఏ బాల్కనీ (బాంద్రా: ముంబయి)లో ముచ్చటించుకునేవారో ఆ చోటే పెళ్లి చేసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమని ఈ జంట పేర్కొంది. ఈ దంపతులు నవంబరులో ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి రాహా అని పేరు పెట్టారు.
నయన్ 💙 విఘ్నేశ్
కోలీవుడ్ నటి నయనతార (Nayanthara), దర్శకుడు (Vignesh Shivan) విఘ్నేశ్ శివన్ జూన్ 9న ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నైలోని మహాబలిపురంలో వీరి పరిణయం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు మగ కవల పిల్లలున్నారు. ‘నానుమ్ రౌడీ ధాన్’ అనే సినిమాతో పరిచయమైన నయన్- విఘ్నేశ్ ఆ తర్వాత ప్రేమికులుగా మారిన సంగతి తెలిసిందే.
నాగశౌర్య- అనూష
నటుడు నాగశౌర్య (Naga Shaurya).. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి నవంబరు 20న దంపతులయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో వీరి వివాహం జరిగింది.
ఆది 💙 నిక్కీ
ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న నటులు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), నిక్కీ గల్రానీ (Nikki Galrani) ఈ ఏడాది మే 18న పెళ్లి చేసుకున్నారు. వీరి పరిచయానికి ‘యాగవరైనమ్ నా కక్కా’ అనే తమిళ సినిమా కారణమైంది.
హన్సిక 💙 సోహైల్
వ్యాపార వేత్త, తన ప్రియుడు సోహైల్‌తో కలిసి డిసెంబరు 4న ఏడడుగులు వేశారు నటి హన్సిక (Hansika Motwani). జైపుర్‌లోని రాజకోట వీరి పెళ్లికి వేదికైంది.
పూర్ణ- షనీద్
నటి పూర్ణ (Shamna Kasim)- యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీల వివాహం అక్టోబరు 25న జరిగింది. కొద్ది మంది అతిథుల సమక్షంలో దుబాయ్‌లో వీరు ఒక్కటయ్యారు (Poorna).
మౌనీరాయ్- సూరజ్
‘నాగిన్’ (తెలుగులో నాగిని) సిరీస్ ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులను, పలు ప్రత్యేక గీతాలతో వెండి తెర ప్రేక్షకులను విశేషంగా అలరించిన నటి మౌనీరాయ్ (Mouni Roy). దుబాయ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సూరజ్ నంబియార్‌తో ఆమె వివాహం గోవాలో జనవరి 27న జరిగింది.
ఫరాన్ అక్తర్ 💙 షిబాని
బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫరాన్ అక్తర్ (Farhan Akhtar).. మోడల్, నటి షిబానీ దండేకర్‌ను ఫిబ్రవరి 9న వివాహమాడారు. అక్తర్‌కు ఇది రెండో పెళ్లి. 2000లో తనకు తొలిసారి వివాహంకాగా 2017లో విడాకులు తీసుకున్నారు.
రిచా చద్దా 💙 అలీ
దాదాపు పదేళ్లు ప్రేమలో ఉన్న రిచా చద్దా (Richa Chadda), అలీ ఫజల్ (Ali Fazal) జంట అక్టోబరు 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
కరిష్మా- వరుణ్
‘దోస్తీ’, ‘గ్రాండ్ మస్తీ’, ‘సంజు’, ‘లాహోర్ కాన్ఫిడెన్షియల్’ తదితర హిందీ చిత్రాలతో అలరించిన నటి కరిష్మా తన్నా (Karishma Tanna). ఈమె వివాహం ఫిబ్రవరి 5న వరుణ్ బంగేరాతో జరిగింది. వరుణ్ వృత్తిరీత్యా బిజినెస్‌మ్యాన్.
శీతల్- విక్రాంత్
బాలీవుడ్ నటులు శీతల్ ఠాకూర్, విక్రాంత్ మెస్సీ ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. ‘బ్రిజ్ మోహన్ అమర్ రహే!’, ‘చప్పడ్ ఫాద్ కే’ తదితర చిత్రాలతో శీతల్ గుర్తింపు పొందగా ‘ఛపాక్’, ‘హసీన్ దిల్‌రుబా’ తదితర సినిమాల్లోని నటనతో విశేష ఆదరణ దక్కించుకున్నారు విక్రాంత్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు బయల్దేరిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
-
India News
రూ.1.5 కోట్లకు అడిగినా.. ఆ దున్నను అమ్మేది లేదట
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ambati Rambabu: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు: మంత్రి అంబటి
-
Crime News
Smita Sabharwal: పదోన్నతుల గురించి మాట్లాడేందుకే వెళ్లా.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన డీటీ వెల్లడి
-
World News
ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..