Inspector Rishi: ఓటీటీలోకి మరో హారర్‌ క్రైమ్‌ సిరీస్.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

నవీన్‌ చంద్ర నటించిన తాజా వెబ్‌ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’. దీని విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.

Published : 15 Mar 2024 09:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు నటుడు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’తో అందరికీ చేరువయ్యారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజా సిరీస్‌ ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ (Inspector Rishi). ఈనెల 29 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు ఐదు భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. హారర్‌ క్రైమ్‌ కథతో రూపొందిన ఈ సిరీస్‌లో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

మొత్తం 10 ఎపిసోడ్‌లతో దీన్ని రూపొందించారు. అంతు చిక్కని హత్యల వెనక ఎవరున్నారనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కించారు. ఆ మిస్టరీని ఇన్‌స్పెక్టర్‌ రిషి ఎలా ఛేదించారన్నదే కథాంశం. నందిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం కీలకపాత్రల్లో నటించారు. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ అనే క్యాప్షన్‌ పెట్టడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ‘ఎలెవన్‌’, ‘సత్యభామ’ల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని