Thank You: అందుకే అన్ని సినిమాల్లో ‘ప్రియ’ అనే పేరు.. నాగచైతన్య ‘థ్యాంక్‌ యూ’ విశేషాలివీ

ఏ చిత్ర పరిశ్రమలోనైనా దర్శకుడు- నటుడు కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంటుంది. తొలి సినిమా సూపర్‌ హిట్‌ అయితే చాలు ఆయా కాంబోలో వచ్చే తదుపరి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ‘థ్యాంక్‌ యూ’ సినిమా ఈ కోవకే చెందుతుంది.

Updated : 20 Jul 2022 11:13 IST

(బీవీఎస్‌ రవి, తమన్‌, విక్రమ్‌, చైతన్య, తమన్)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ చిత్ర పరిశ్రమలోనైనా దర్శకుడు- కథానాయకుడు కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంటుంది. తొలి సినిమా సూపర్‌ హిట్‌ అయితే చాలు ఆయా కాంబోలో వచ్చే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ‘థ్యాంక్‌ యూ’ (Thank You) సినిమా ఈ కోవకే చెందుతుంది. నాగచైతన్య (Naga Chaiatnya) హీరోగా దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ (Vikram K Kumar) తెరకెక్కించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలకాబోతున్న నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విశేషాలు చూద్దాం..

  1. ‘సైలెంట్‌ స్క్రీమ్‌’ అనే ఆంగ్ల చిత్రంతో దర్శకుడిగా మారిన విక్రమ్‌ కె. కుమార్‌ తొలి ప్రయత్నంలోనే జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత, ‘ఇష్టం’, ‘అలై’, ‘13 బీ’, ‘ఇష్క్‌’ సినిమాతో ప్రేక్షకులకు విభిన్న కథలను పరిచయం చేశారు. అక్కినేని కుటుంబ హీరోలతో ‘మనం’ తెరకెక్కించి, దర్శకుడిగా మరో మెట్టు పైకెక్కారు. ఏయన్నార్‌, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ ఈ చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. అలా, ‘మనం’ తర్వాత విక్రమ్‌, చైతూ కాంబోలో రూపొందిన సినిమా ‘థ్యాంక్‌ యూ’. మరోవైపు, ఈ కాంబినేషన్‌లో ‘ధూత’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‌ త్వరలోనే ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.
  2. ‘థ్యాంక్‌ యూ’.. నటుడిగా నాగచైతన్యకు 21, దర్శకుడిగా విక్రమ్‌కు 10వ సినిమా. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో (Sri Venkateswara Creations) నాగచైతన్య నటించిన రెండో చిత్రమిది. చైతూ తొలి సినిమా ‘జోష్‌’ ఈ నిర్మాణ సంస్థలోనే రూపొందింది.
  3. మరొకరు కథ అందించగా విక్రమ్‌ డైరెక్షన్‌ చేయడం తన కెరీర్‌లో ఇదే తొలిసారి. ‘థ్యాంక్‌ యూ’ కథను బీవీఎస్‌ రవి (BVS Ravi) రాశారు. ఇదొక కల్పిత కథ.
  4. విక్రమ్‌ ఇంతకుముందు తెరకెక్కించిన అన్ని చిత్రాల్లోనూ హీరోయిన్ పాత్ర పేరు ‘ప్రియ’ (Priya). ఈ చిత్రంలో ఆ పేరును కథానాయిక రాశీఖన్నాకు పెట్టారు. ‘ఈ పేరంటే నాకు బాగా ఇష్టం. అంతే తప్ప మరే కారణం లేదు’ అని ఆ పేరు పెట్టడంపై విక్రమ్‌ ఓ సందర్భంలో స్పందించారు.
  5. ‘థ్యాంక్‌ యూ’లో నాగచైతన్య మూడు విభిన్న పాత్రల్లో నటించారు. 16 ఏళ్ల కుర్రాడిగా, 21 ఏళ్ల యువకుడిగా, 35 ఏళ్ల వ్యక్తిగా ఆయా పాత్రల్లో ఆయన ఇమిడిపోయారంటూ దర్శకుడు ఇటీవల నాగచైతన్యను ప్రశంసించారు. 16 ఏళ్ల లుక్‌ కోసం చైతూ సుమారు 50 రోజులపాటు ప్రత్యేక డైట్‌ తీసుకుని బరువు తగ్గారట.
  6. ‘తడాఖా’, ‘వెంకీమామ’ తర్వాత సంగీత దర్శకుడు తమన్‌, చైతన్య కాంబినేషన్‌లో ‘థ్యాంక్‌ యూ’ రూపుదిద్దుకుంది. మరోవైపు, నాగచైతన్య హీరోగా గతంలో తెరకెక్కిన ‘మజిలీ’కి తమన్‌ కేవలం నేపథ్య సంగీతం అందించారు.
  7. రాశీఖన్నాతో (Raashi Khanna) నాగచైతన్య కలిసి నటించిన రెండో చిత్రమిది. అంతకుముందు ‘వెంకీమామ’లో వీరిద్దరూ జంటగా కనిపించారు. ‘థ్యాంక్‌ యూ’లో రాశీతోపాటు మాళవిక నాయర్‌ (Malavika Nair), అవికా గోర్‌ (Avika Gor) సందడి చేయనున్నారు. ఈ ఇద్దరితో కలిసి నాగచైతన్య తొలిసారి నటించారు. ప్రకాశ్‌రాజ్‌, సాయి సుశాంత్‌రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
  8. ఈ సినిమాలో నాగచైతన్య అభిరామ్‌గా కనిపిస్తారు. ‘మనలో చాలామంది చెప్పాల్సిన సందర్భంలో థ్యాంక్స్‌ చెప్పకుండా చిన్న చిన్న వాటికి చెప్తూ ఆ మాటకున్న విలువ తగ్గిస్తున్నాం. థ్యాంక్‌ యూ అనే మాటకు అసలైన అర్థం చెప్పబోతున్నాం’ అని చిత్ర బృందం ప్రచారంలో భాగంగా తెలియజేసింది. మరి ఈ సినిమాలో ఎవరికి ఎవరు ఎప్పుడు ‘థ్యాంక్‌ యూ’ చెప్పారు? అభిరామ్‌ జీవితం ఎలా ఉంటుంది? అనేది ఆసక్తికరం.
  9. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నాగ చైతన్య.. మహేశ్‌బాబు అభిమానిగా కనిపిస్తారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని