‘ఐరన్‌ లెగ్’ ఆ పేరే దెబ్బకొట్టింది..!

గునుపూడి విశ్వనాథశాస్త్రి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఐరన్‌ లెగ్‌ శాస్త్రి అంటే ఎవరైనా ఠక్కున గుర్తు పట్టేస్తారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ‘అప్పుల అప్పారావు’ చిత్రంతో

Updated : 20 Sep 2020 15:13 IST

గునుపూడి విశ్వనాథశాస్త్రి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఐరన్‌ లెగ్‌ శాస్త్రి అంటే ఎవరైనా ఠక్కున గుర్తు పట్టేస్తారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ‘అప్పుల అప్పారావు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హాస్యనటుడు.. తనదైన భారీ ఆకారం, అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో వెండితెరపై 150కిపైగా చిత్రాల్లో నవ్వులు పూయించారు. ముఖ్యంగా కామెడీ కింగ్‌ బ్రహ్మానందంతో కలిసి ఐరన్‌లెగ్‌ పంచిన   వినోదాల విందు నాటికీ నేటికీ సినీప్రియుల మోములపై నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. నిజానికి ఆయన నటుడిగా మారడానికి ముందు సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేస్తుండేవారు.

ఐరన్‌ లెగ్‌గా ఈవీవీ ఆయనకు ఓ ఇమేజ్‌ క్రియేట్‌ చేశాక.. చిత్రసీమలో చాలా కాలం వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. హాస్య నటుడిగా ఇంతగా అందరి మదిపై చెరగని ముద్ర వేసిన ఐరన్‌ లెగ్‌ శాస్త్రి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో సినిమా అవకాశాలు లేక పౌరోహిత్యం వైపు తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు.. తన స్క్రీన్‌ నేమ్‌ ఉపాధి కరవయ్యేలా చేసిందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయన స్వయంగా వెల్లడించారు.

సినిమాల్లో ఐరన్‌ లెగ్‌ పాత్రను ఎక్కువగా దరిద్రానికి, దురదృష్టానికీ సింబాలిక్‌గా చూపించి నవ్వులు పూయించారు. నిజానికి అది తెరపై పాత్రే అయినప్పటికీ.. ఆ పేరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పౌరోహిత్యంతో చేసుకొని పొట్టపోసుకుందాం అనుకున్నప్పటికీ.. ఐరన్‌ లెగ్‌ ఎఫెక్ట్‌ వల్ల ఎవరూ ఆయన్ని శుభకార్యాలకు పిలిచేవారు కాదట.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని