Rajinikanth: ‘జైలర్‌’ హవా.. రజనీకాంత్‌కు డబుల్‌ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

థియేటర్లలో ‘జైలర్‌’ (Jailer) హవా కొనసాగుతోంది. రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ఈ సినిమా అంతటా మంచి వసూళ్లతో ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Published : 01 Sep 2023 13:01 IST

చెన్నై: ‘జైలర్‌’ (Jailer) ఘన విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ (Kalanithi Maran). చిత్రానికి వస్తోన్న వసూళ్ల పట్ల ఆనందంగా ఉన్న ఆయన కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth)కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రజనీని ప్రత్యేకంగా కలిశారు. చిత్రానికి వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని చెక్‌ రూపంలో అందించారు. అలాగే, రెండు బీఎండబ్ల్యూ కారులను తీసుకువెళ్లి.. అందులో నచ్చింది సెలెక్ట్‌ చేసుకోవాలని కోరారు. బీఎండబ్ల్యూ ఎక్స్‌7 మోడల్‌ కారును రజనీ సెలెక్ట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక, ఈ కారు ధర దాదాపు రూ.1.26 కోట్లు ఉంటుందని సమాచారం.

కన్నీళ్లు ఆగట్లేదు.. ‘ఖుషి’ విడుదలపై విజయ్ దేవరకొండ ఎమోషనల్‌ ట్వీట్‌

‘రోబో’, ‘పేట’, ‘అన్నాత్తె’ తర్వాత కళానిధి మారన్‌, రజనీకాంత్‌ కలిసి వర్క్‌ చేసిన సినిమా ‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ దీనిని నిర్మించారు. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా అంతటా సూపర్‌హిట్‌ టాక్‌ అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ స్వరాలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు