నాగార్జునతో కాజల్‌!

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ సీనియర్‌ అయ్యే కొద్ది ఇండస్ట్రీలో ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. తాజాగా ఆమె కింగ్‌ నాగార్జున సరసన నటించడానికి సిద్ధమైంది. ‘గరుడ వేగ’తో సాలిడ్‌ హిట్టు కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ

Published : 18 Mar 2021 12:14 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ చందమామ కాజల్‌కు ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవలేదు. తాజాగా ఆమె కింగ్‌ నాగార్జున సరసన నటించడానికి సిద్ధమైంది. ‘గరుడ వేగ’తో సాలిడ్‌ హిట్టు కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగమౌతున్నందుకు సంతోషంగా ఉందంటూ సదరు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. పెళ్లైన తర్వాత కాజల్‌ స్క్రిప్ట్‌ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలు కాకుండా కథలో ప్రధాన పాత్రలనే ఎంచుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మెసగాళ్లు’చిత్రంలో విష్ణుకు అక్కగా నటించటమే ఇందుకు తార్కాణం. అలాగే ‘ఆచార్య’లో కూడా కథకు అవసరమైన కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు యాక్షన్‌ డ్రామా తెరకెక్కుతున్న నాగ్‌, కాజల్‌ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమా సంస్థ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరోవైపు నాగార్జున నటించిన ‘వైల్డ్‌ డాగ్‌’ ఏప్రిల్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని