Kamal Haasan: ‘విక్రమ్’ కోసం ‘బిగ్‌బాస్’కు దూరమైన కమల్‌హాసన్
తాను హోస్ట్‌గా వ్యవవహిరిస్తున్న ‘బిగ్‌బాస్ అల్టిమేట్’ (బిగ్‌బాస్ ఓటీటీ- తమిళం) కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘బిగ్‌బాస్ అల్టిమేట్’ (బిగ్‌బాస్ ఓటీటీ- తమిళం) కార్యక్రమ హోస్ట్‌గా తాను తప్పుకున్నట్టు ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించారు. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో నటిస్తున్న ‘విక్రమ్’ సినిమాను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. ‘‘డిజిటల్ మాధ్యమంలో ‘బిగ్‌బాస్’ను ఆవిష్కరించటాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ షో నా హృదయానికి బాగా దగ్గరైంది. ఈ కార్యక్రమానికి బాగా కనెక్ట్ అయ్యా. ముందు నుంచీ ‘విక్రమ్’ చిత్రం, ‘బిగ్‌బాస్’ చిత్రీకరణకు సంబంధించిన షెడ్యూల్‌ని పక్కగా ప్లాన్ చేశాం. కానీ, కొవిడ్/లాక్డౌన్ కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. అందరి షెడ్యూల్స్ మారాయి. ‘విక్రమ్’ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణుల కాంబినేషన్లో వచ్చే కీలక సన్నివేశాలు తెరకెక్కించాలి. ఒకవేళ అందరి డేట్స్ సర్దుబాటు అయ్యాక ‘బిగ్‌బాస్’ కారణంగా నేను షూటింగ్‌కు హాజరవకపోతే న్యాయంగా ఉండదు. మునుపటిలా ‘విక్రమ్’, ‘బిగ్‌బాస్’.. రెండిటినీ చూసుకోవటం కష్టం. అందుకే ప్రస్తుతానికి ‘బిగ్‌బాస్’ నుంచి వైదొలుగుతున్నా’’ అని కమల్ లేఖలో పేర్కొన్నారు.
బుల్లితెరపై పలు ‘బిగ్‌బాస్’ సీజన్లలో హోస్ట్‌గా అలరించిన కమల్‌హాసన్ తొలిసారి ఓటీటీలో సందడి చేశారు. కమల్‌హాసన్ హీరోగా ‘ఖైదీ’ ఫేం లోకేశ్ కనకరాజు తెరకెక్కిస్తున్న చిత్రమే ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్‌పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్‌పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్‌కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్‌లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్‌పుర్ తల్లీకొడుకులు
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి