Vikram: మూడు సింహాల్లాంటి ఫస్ట్‌లుక్‌

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌, క్రేజీ డైరెక్టర్‌ లోకేశ్‌ కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్‌థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంది. 22మిలియన్లకు పైగా వీక్షకులు ఈ టీజర్‌ను వీక్షించారు. ఇదిలా ఉండగా చిత్రబృందం తాజాగా చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది.

Published : 10 Jul 2021 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌, క్రేజీ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంది. 22మిలియన్లకు పైగా వీక్షకులు ఈ టీజర్‌ను వీక్షించారు. ఇదిలా ఉండగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది. అయితే కేవలం కమల్‌హాసన్‌ లుక్‌ మాత్రమే వస్తుందని అందరూ ఊహించారు. కానీ, ముగ్గురు నటులు కమల్‌హాసన్‌, విజయ్‌సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ను ఫస్ట్‌లుక్‌లోనే రివీల్‌ చేసి చిత్రబృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మూడు సింహాల్లా సీరియస్‌లుక్‌లో కనిపిస్తున్న ముగ్గురు నటులతో ఉన్న ఆ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ఆసక్తికరంగా ఉంది.

తమిళ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ఇదొకటి. ఎందుకంటే ఇప్పటికే ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాలతో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న లోకేశ్‌ కనకరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌హాసన్‌ హీరోగా, విజయ్‌సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో, మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ఓ కీలకపాత్రలో కనిపించనుండటం అంచనాలకు మరో కారణం. ‘మాస్టర్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్‌దాస్‌ కూడా ఇందులో మెరవనున్నాడు. వెరసి సినిమా పట్టాలెక్కడానికి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలోని ఇతర తారాగణంతో పాటు విడుదల తేదీ తదితర వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రం చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని