Chiranjeevi: చిరంజీవి ఇంట శివ రాజ్‌కుమార్‌.. ఆ ఫొటో ఫ్రేమ్‌ వైరల్‌

కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ను అభినందించేందుకు కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ ఆయన నివాసానికి విచ్చేశారు. సంబంధిత ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Updated : 04 Feb 2024 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar).. చిరంజీవి (Chiranjeevi) ఇంట సందడి చేశారు. కేంద్రం చిరుకి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కంగ్రాట్స్‌ చెప్పేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించారు. సంబంధిత ఫొటోలను చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ.. ‘‘డియర్‌ శివ రాజ్‌కుమార్‌.. నన్ను అభినందించేందుకు మీరు బెంగళూరు నుంచి రావడం హృదయాన్ని హత్తుకుంది’’ అని పేర్కొన్నారు. ఆయనతో కలిసి భోజనం చేయడం, లెజండరీ నటుడు రాజ్‌కుమార్‌ (శివ రాజ్‌కుమార్‌ తండ్రి)తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆ ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించగా వాటిలో కనిపించే ఓ ఫొటో ఫ్రేమ్‌ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?

ఈ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ గమనించారా? చిరు అందుకున్న ‘నంది’సహా పలు అవార్డులతోపాటు తనయుడు, హీరో రామ్‌ చరణ్‌తో కలిసి దిగిన ఫొటో ఫ్రేమ్‌ మిమ్మల్ని ఆకర్షిస్తోందా?. దీనిపైనే ఫోకస్‌ పెట్టిన అభిమానులు ‘ఫ్రేమ్‌ అదుర్స్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

నంది అవార్డులకు గద్దర్‌ పేరు.. ఆ నిర్ణయం సముచితమే: చిరంజీవి

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్న చిత్రంలో శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. క్రీడా నేపథ్యంలో ఆ సినిమా రూపొందనుందని సమాచారం. మరోవైపు చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని