
Updated : 26 Jan 2022 16:43 IST
Khiladi: రవితేజ ‘ఖిలాడి’.. ఫుల్ కిక్ వచ్చేసింది
ఇంటర్నెట్‌డెస్క్: సినీప్రియులకు ఫుల్ కిక్ అందిస్తానంటూ గణతంత్రదినోత్సవం రోజున దూసుకొచ్చారు కథానాయకుడు రవితేజ(Ravi teja). రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని నాలుగో పాటని విడుదల చేశారు. ‘‘ఫుల్ కిక్’’ అంటూ సాగే ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, సాగర్, మమత శర్మ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ బీట్‌కు శేఖర్ మాస్టర్ సమకూర్చిన నృత్యాలు అలరిస్తున్నాయి.
Tags :